ఇలానే జరిగింది హెలికాప్టర్ ఉదయం 8.30 గంటలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, పి.సుబ్రహ్మణ్యం, ఎసిఎన్ వెస్లి లతో హెలికాప్టర్ పయనమైంది.
బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ బయలుదేరిన తర్వాత 50 నాటికల్ మైళ్ళ దూరం వరకు హైదరాబాద్ రాడార్ (శంషాబాద్ విమానాశ్రయంలోని) హెలికాప్టర్ కదలికలను మానిటర్ చేస్తుంది. ఆ తర్వాత మార్గ నిర్వహణను చెన్నై హెచ్ ఎఫ్ రేడియో (చెన్నైలోని రీజినల్ సెంటర్) నిర్వహిస్తుంది. హెలికాప్టర్ పైకి ఎగిరిన తర్వాత ఎటిసికి పైలట్ కు మధ్య సంబంధాలు ఏర్పడతాయి. హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి పైకి ఎగిరిన తర్వాత ఎటిసికి పైలట్ కు మధ్య సంబంధాలు ఏర్పడతాయి. హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి రెండు నిముషాల ముందు పైలట్ చెన్నైలోని రీజినల్ సెంటర్ కు ఆ విషయాన్ని తెలియజేస్తారు. హెలిపాడ్ లో దిగిన తర్వాత పోలీసు శాఖకు ఇంటెలిజన్స్ సెక్యూరిటీ విభాగం ముఖ్యమంత్రి కదలికలను పర్యవేక్షిస్తుంది.
Pages: -1- -2- 3 -4- News Posted: 9 September, 2009
|