ఇలానే జరిగింది ముఖ్యమంత్రి పర్యటిస్తున్న హెలికాప్టర్ గమ్యస్థానాన్ని చేరుకోవడంలో జాప్యం అయిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నది వాస్తవం కాదు.సెప్టెంబర్ రెండే తేదీన ఎస్పీ, సిఎం సెక్యూరిటీ గ్రూప్ శశిధర్ రెడ్డి చిత్తూరులో ఉన్నారు. ఇంటెలిజన్స్ సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా ముఖ్యమంత్రి కార్యక్రమాల ఏర్పాట్లను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ చేరుకోవడంలో జాప్యం అయిన విషయాన్ని ఇంటెలిజెన్స్ అడిషినల్ డిజికి ఆయన తెలియజేశారు.
సెప్టెంబర్ ఒకటో తేదీన చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లకు వాతావరణ పరిస్థితిని ఎపిఏవియేషన్ సంస్థ తెలియజేసి దాన్ని పైలట్ కు చెప్పాల్సిందిగా తెలిపింది.
శాటిలైట్ ఫోన్ హెలికాప్టర్ లో గాని, పైలట్ వినియోగించే పరికరాల్లో గాని భాగం కాదు. సివిల్ ఏవియేషన్ సంస్థ తెలియజేసి దాన్ని పైలట్ కు చెప్పాల్సిందిగా తెలిపింది.
శాటిలైట్ ఫోన్ హెలికాప్టర్ లో గాని, పైలట్ వినియోగించే పరికరాల్లో గాని భాగం కాదు. సివిల్ ఏవిషేయన్ నిబంధనల ప్రకారం విహెచ్ఎఫ్/హెచ్ ఎఫ్ మార్గం ద్వారా తప్ప ఫైలట్ ఎటువంటి ఫోన్లను వాడరాదు.
హెలికాప్టర్ లోని ఎమర్జెన్సీ లొకేట్ ట్రాన్స్ మీటర్ (ఇఎల్ టి) కండిషన్ ఎలా ఉందన్నది సిఐడి,డిజి సిఎ, ద్విసభ్య ఉన్నత స్థాయి కమిటీ విచారణలో వెల్లడవుతుంది.
Pages: -1- -2- -3- 4 News Posted: 9 September, 2009
|