ఇలానే జరిగింది ఆగస్టు 21వ తేదీన డిజిసిఎ ఇచ్చిన ఉత్తర్వులు ఎవి 22019/05/08 - ఎఫ్ఐడి ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీన పైలట్ క్యాప్టన్ ఎన్ కె భాటియా క్యాప్టన్ ఎంఎన్ రెడ్డికి బెల్ -430 హెలికాప్టర్ పై ఉన్న అనుభవాన్ని పరీక్షించారు. గంట 15 నిమిషాల పాటు ప్రయాణించి హెలికాప్టర్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 5 గంటలకు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైనెన్స్ ఇంజనీర్ ఎం.లక్ష్మణరావు నాయకత్వంలోని మెయింటెనెన్స్ బృందం ప్రీ ప్లైట్ ఇన్ స్పెక్షన్ చేశారు.
అదే రోజు ఉదయం 6.15 నిమిషాలకు పైలట్లకు వైద్యాధికారి పరీక్షలు నిర్వహించారు. క్యాప్టన్ ఎన్ కె భాటియా పైలట్ ఇన్ కమాండ్ హోదాలో ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (ఎఎంఇ) నుండి అనుమతి పొంది ఎయిర్ పోర్టు హేంగర్ లో ఉన్న హెలికాప్టర్ ను బేగంపేట పాత ఎయిర్ పోర్టులోని వివిఐపి పాయింట్ కు తీసుకువచ్చారు. దీనికి 10 నిమిషాల సమయం పట్టింది.
ఉదయం 6.30కి బేగంపేట ఎయిర్ పోర్ట్ వివిఐపి పాయింట్ లో ఉంచిన హెలికాప్టర్ లో ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలోని సిబ్బంది విద్రోహచర్యల నివారణకు బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో తనిఖీ చేశారు. వీరు క్యాబిన్, బ్యాగేజీ, పరిసరాలను కూడా పరిశీలించి వివిఐపి లాంజ్ వరకూ హెలికాప్టర్ ను తీసుకువెళ్ళేందుకు అనుమతించారు. ఉదయం 7.30కి హెలికాప్టర్ బయలుదేరాల్సి ఉంది.
డిజిపి మార్గదర్శకాలకు అనుగుణమంగా పైలట్ ఇన్ కమాండ్ వెంటనే లిఖతపూర్వకంగా ప్రారంభప్రదేశం, వెళ్తున్న ప్రాంతాలను, రూట్ ను తెలియజేసి ఎటిసి క్లియరెన్స్ ను తీసుకున్నారు. వ్యక్తిగతంగానే మెటరాలజీ డిపార్ట్ మెంట్ కు వెళ్లి (బేగంపేట ఎయిర్ పోర్టులోని ఫస్టుఫ్లోర్ లో ఉంది) వాతావరణం పరిస్థితిని కూడా స్వయంగా లిఖితపూర్వకంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ పరిశోధన కేంద్రం కూడా ధృవీకరించింది.
Pages: -1- 2 -3- -4- News Posted: 9 September, 2009
|