సెకండ్ మార్కెట్లో నానో
నానో కార్లకు బుకింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో టాటా మోటార్స్ సంస్థ ఇంకా ప్రకటించకపోవడం కూడా ఈ డిమాండ్ పెరుగుదలకు కారణమైంది. నానో మొదటి బ్యాచ్ కార్లను డెలివరీ చేసిన తరువాత మాత్రమే బుకింగ్ లు తిరిగి ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ సంస్థ తొలుత ప్రకటించింద.ి మొదటి బ్యాచ్ డెలివరీలు 2010 చివరి త్రైమాసికానికి పూర్తి కాగలవని సంస్థ సూచించినప్పటికీ తమకు 2011 మొదటి త్రైమాసికంలో అందగలవని చెప్పారని కొందరు అలాటీలు తెలియజేశారు.
సెకండ్ హాండ్ మోడళ్ళన్నీ రూ. 185375 ధర (ముంబై షోరూమ్ ధర) నిర్ణయించిన టాప్-ఎండ్ ఎల్ఎక్స్ తరగతివే. ఈ రకం ఆన్-రోడ్ ధర రూ. 2 లక్షలకు పైగానే ఉన్నది. 'సెకండ్ హాండ్ నానో కార్ల కొనుగోలుదారులు ఎవరంటే ఆ కారుపై విపరీతంగా మోజు పెంచుకున్నవారే. కారు వల్ల ఉపయోగానికి మించి దానికి ఉన్న విలువే ఇందుకు కారణం., ముంబై, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సిఆర్), గుజరాత్ లకు చెందినవారు పసుపు రంగువి, హై-ఎండ్ రకాలవి ఎక్కువగా కోరుకుంటున్నారు' అని ఢిల్లీకి చెందిన మరొక యూజ్డ్ కార్ డీలర్ చెప్పారు.
కాగా, టాటా మోటార్స్ సమాచారం ప్రకారం, మూడు రకాల నానో కార్లలో 2.03 లక్షల బుకింగ్ లలో 50 శాతం ఎల్ఎక్స్ రకానివి, 30 శాతం సిఎక్స్ రకానివి కాగా, 20 శాతం మాత్రమే స్టాండర్డ్ వేరియంట్ వి.
Pages: -1- 2 News Posted: 21 September, 2009
|