పొదుపు డిపాజిట్లే పాపులర్
బ్యాంకులు కూడా ఇటువంటి అకౌంట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే ఇవి చౌకగా నిధులను సమకూరుస్తుంటాయి. తద్వారా వాటి మార్జిన్లు మెరుగవుతుంటాయి. దాదాపు అన్ని బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కరెంట్ అకౌంట్లు, సేవింగ్స్ అకౌంట్ల దామాషాను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
అయితే, ప్రస్తుతం సేవింగ్స్ డిపాజిట్ పై వడ్డీని లెక్కిస్తున్న తీరు డిపాజిటర్ కు నష్టదాయకంగా ఉంటున్నది. ప్రతి నెల పదవ తేదీక చివరి తేదీకి మధ్య అకౌంట్ లో ఉన్న కనీస మొత్తంపైనే వడ్డీ చెల్లిస్తుంటాయి బ్యాంకులు. దీనినే మరొక విధంగా చెప్పాలంటే డిపాజిటర్లు ఏదైనా నెలలో పదవ తేదీ లోపలే తమ ఖాతాలలోకి పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసినా లేక విత్ డ్రా చేసినా ఆ డబ్బు ద్వారా వడ్డీ ఏమాత్రం రాదు. కాని బ్యాంకు డిపాజిట్ కాలంలో డబ్బును ఉపయోగించుకోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) వడ్డీ లెక్కించే పద్ధతిని వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చవలసిందిగా ప్రతిపాదించింది. ఏదైనా నెలలో మొదటి తేదీ నుంచి చివరి తేదీ వరకు అకౌంట్ లో కనీస నెలసరి బ్యాలెన్స్ ప్రాతిపదికగా లేదా దినసరి బ్యాలెన్స్ ప్రాతిపదికగా వడ్డీ చెల్లించాలని బ్యాంకులకు ఆర్ బిఐ సూచించింది. దీని వల్ల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్లపై మరింతగా ఆర్జించేందుకు అవకాశం లభిస్తుంది.
Pages: -1- 2 News Posted: 22 September, 2009
|