మళ్లీ కాస్పరోవ్, కార్పోవ్ పోరు
పావులు చకచకా కదిలాయి. ఒక్కొక్కరికి 25 నిమిషాల సేపు మాత్రమే ఆడవలసిస ఉండడంతో వారు ఆలోచించడానికి అంత ఎక్కువ వ్యవధి ఉండదు. పోరులో కేవలం ఒక డ్రాకు అంగీకరించడానికే వారికి ఏళ్ళూ పూళ్ళూ పట్టినప్పుడు మాస్కోలో ఎదురైన అనుభవం వలె వీక్షకుల నుంచి వారికి అవహేళన ఉండకపోవచ్చు. అయినప్పటికీ, కాస్పరోవ్ తన ఎత్తులు ఆలోచిస్తూ కొద్దిసేపటిలోనే తన చేతుల్లో తన ముఖాన్ని కప్పుకోవడం కనిపించింది. కాగా కార్పోవ్ చూపులు బోర్డుపై చకచకా కదిలాయి.
అయితే, వారి గేమ్ ను ప్రసారరం చేస్తున్న వెబ్ సైట్ దాదాపు ఆ వెంటనే కుప్పకూలింది. బహుశా వాలెన్షియా స్థానిక ప్రభుత్వానికి చెందిన సర్వర్ పోటీని చూడాలనుకుంటున్న అసంఖ్యాకుల ఒత్తిడికి తట్టుకోలేకపోయి ఉంటుంది.
ఇక స్వదేశంలో ఆ చదరంగం ప్రముఖుల ప్రతిపత్తిని గుర్తు చేస్తున్నట్లుగా రెండు డజన్ల మంది రష్యన్ జర్నలిస్టులు ఈ పోటీ కవరేజి కోసం వచ్చారు. 'ప్రధానిని, అధ్యక్షుని మినహాయిస్తే మా దేశంలో బహుశా మేము అత్యంత ప్రముఖులమేమో' అని కార్పోవ్ ఆతరువాత ఛలోక్తి విసిరాడు.
1984లో మాస్కోలో ప్యాలెస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ లోని హాల్ ఆఫ్ కాలమ్స్ లో సాగిన ఆ పోరును గుర్తు చేసే ఈ పోటీకి పాలావ్ డి లె ఆర్ట్స్ ఒపేరా హౌస్ సరైన వేదికే అయింది. కాని అనుమాన దృక్కుల సోవియట్ అధికారులకు బదులు ఇక్కడ పొట్టి స్కర్ట్ లు ధరించిన హోస్టెస్ లు, యూనిఫారమ్ తో ఉన్న గార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టుదల, ప్రపంచ రాజకీయాల రోజులు గతించాయి. లగ్జరీ, మధ్యధరా ప్రాంతపు ప్రశాంతత చోటు చేసుకున్నాయి.
Pages: -1- 2 -3- News Posted: 24 September, 2009
|