మళ్లీ కాస్పరోవ్, కార్పోవ్ పోరు
ప్రపంచ టైటిల్ కోసం వారి మధ్య అసాధారణ రీతిలో, ఐదు నెలల పాటు సాగి అర్ధంతరంగా నిలిపివేసిన పోటీ జరిగి సుమారు 25 సంవత్సరాలు గడిచాయి. టైటిల్ కోసం 1984 సెప్టెంబర్ 10న వారు తొలి గేము ఆడారు. ఆతదుపరి ఆరు సంవత్సరాలలో వారి మధ్య 144 గేములు జరిగాయి.
ఈ వార్షికోత్సవం సందర్భంగా స్వదేశంలో ఆడేందుకు తాను ఇష్టపడి ఉండేవాడినని కాస్పరోవ్ చెప్పాడు. కాని అతని రాజకీయ ఆకాంక్షలు, వ్లాదిమిర్ పుతిన్ అంటే అతనికి గల వ్యతిరేకత అతను రష్యాలో ఉండరాని వ్యక్తి అయ్యాడు. 'మేము మాస్కోలో ఆడలేము. ఎందుకంటే అది కాస్పరోవ్ కు పబ్లిసిటీ అయి ఉండేది. వారు అది కోరుకోరు' అని అతను వాలెన్షియాకు చెందిన 'లెవంట్' వార్తాపత్రిక విలేఖరితో అన్నాడు.
తన పాత ప్రత్యర్థిపై కాస్పరోవ్ దే ఎప్పుడూ పైచేయిగా ఉన్నట్లుంది. టీనేజర్ గా ఉన్నప్పుడు అతను కార్పోవ్ ను తీసిపారేస్తున్నట్లుగా 'ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ లేని క్రీడాకారుడు' అని వ్యాఖ్యానించాడు. 1984 టైటిల్ మ్యాచ్ లో అతను మానసికంగా కార్పోవ్ ను దెబ్బ తీసినట్లు కనిపించింది. దీనితో కార్పోవ్ ప్రతిష్ఠను కాపాడేందుకు ప్రపంచ చదరంగ సమాఖ్య అధికారులు ఆ మ్యాచ్ ను నిలిపివేయవలసి వచ్చింది.
మంగళవారం రాత్రి చరిత్ర పునరావృతమవుతుందేమోననే సూచన కనిపించింది. తొలి గేము ఓడిపోయిన కార్పోవ్ తిరిగి పరాజయాల బాట పట్టనున్నాడా అని అనిపించింది. అయితే, శుక్రవారానికల్లా వారు డజను 'సెమీ-రాపిడ్', సూపర్ ఫాస్ట్ 'బ్లిట్జ్' గేములు ఆడడంతో ఈ పోరు ముగుస్తుంది. వారు అధిక రాబడితో ఇంటిముఖం పడతారు. కాని వారిలో ఒకరే ఆనందంగా ఇంటికి వెళతారు.
Pages: -1- -2- 3 News Posted: 24 September, 2009
|