పెరిగిన కార్ల అమ్మకాలు
కారు యజమానులు కొందరు ఈ సీజన్ లో రెండవ కారును కొంటున్నారని డీలర్లు తెలియజేశారు. 'నిర్వహణ ఖర్చుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే, చాలా మంది తమ కారును అట్టిపెట్టుకోవడానికి లేదా మరొక కారును కొనడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే, ఈ పండగ సీజన్ ఆ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చింది' అని మరొక కారు డీలర్ చెప్పారు.
కార్ల అమ్మకాలు ఎప్పటి వలె సంవత్సరాంతానికి పెరగగలవని కొందరు ఏజెంట్లు అభిప్రాయం వెలిబుచ్చారు. 'కార్ల అమ్మకాలు ఏప్రిల్ నుంచి నెల నెలా పెరుగుతున్నాయి. ఈ పండగ సీజన్ మొదలైన తరువాత పరిస్థితి మరింత ఆశాజనకంగా తయారైంది. వీటి అమ్మకాలు వచ్చే నెల పెరుగుతాయని, డిసెంబర్ లో తారస్థాయిని చేరుకుంటాయని మేము ఆశిస్తున్నాం' అని హ్యుందై మోటార్స్ రీజనల్ మేనేజర్ రామచంద్రన్ 'టిఒఐ' విలేఖరితో చెప్పారు. అన్ని ధరల శ్రేణులలో కార్లకు కొనుగోలుదారులు ఉంటున్నారని ఆయన తెలిపారు. ఐ20, ఐ10, వెర్నా కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఆయన తెలిపారు. ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో నగర రోడ్లపై మరిన్ని కార్లు, కొత్త మోడళ్ళు రివ్వున సాగిపోతుండడం చూడవచ్చన్నమాట.
Pages: -1- 2 News Posted: 25 September, 2009
|