పాక్ పైనే ఇండియా ఆశలు
హుస్సీ ఆతరువాత కూడా ధాటిగా పరుగులు స్కోరు చేయసాగాడు. మబ్బులు పట్టి వర్షం కురవబోతుందనగా ఆస్ట్రేలియన్లు 35 ఓవర్లు ముగిసిన తరువాత తమ బ్యాటింగ్ పవర్ ప్లేను కోరుకున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని కెమరాన్ వైట్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ స్కోరు చేశాడు. ఆసీస్ జట్టుకు పరుగులు తేలికగా రాసాగాయి. భారత జట్టు మరొక సారి 300పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించవలసి వస్తుందేమోనని అనుకుంటున్న తరుణంగా వర్షం పడనారంభించింది.
స్కోరు వివరాలు : ఆస్ట్రేలియా : షేన్ వాట్సన్ (సి) హర్భజన్ (బి) నెహ్రా 0, టిమ్ పైన్ (సి) హర్భజన్ (బి) 56, రిక్కీ పాంటింగ్ రనౌట్ 65, మైకేల్ హుస్సీ (సి) టెండూల్కర్ (బి) ఇశాంత్ శర్మ 67, కెమరాన్ వైట్ 35 నాటౌట్, సి ఫెర్గూసన్ 2 నాటౌట్, ఎక్స్ ట్రాలు 9, మొత్తం 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 234.
వికెట్ల పతనం : 1-3, 2-87, 3-175, 4.227
బౌలింగ్ : ఆశిష్ నెహ్రా 8-1-38-1, ప్రవీణ్ కుమార్ 8-0-34-0, ఇశాంత్ శర్మ 7.4-0-53-1, అమిత్ మిశ్రా 9-0-45-1, హర్భజన్ సింగ్ 9-0-54-0, సురేష్ రైనా 1-0-8-0.
Pages: -1- -2- 3 News Posted: 29 September, 2009
|