పెట్రో కారిడార్ కు శ్రీకారం
కాకినాడలో కాకినాడ సెజ్ పరిధిలో జిఎమ్‌ఆర్ రిఫైనరీ, తదితర పెద్ద ప్రాజెక్టులు వస్తున్న విషయం తెలిసిందే. ఆదిలోనే పిసిపిఐఆర్‌ప్రాజెక్టుకు తీవ్ర అడ్డకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని యాంకర్ కంపెనీలు మెల్ల మెల్లగా ఒక్కొక్కటీ జారుకుంటున్నాయి. ఒక వైపు మాంద్యం, మరోవైపు సర్కార్ స్వయం కృతాపరాధంతో రూ. 60 వేల కోట్లకుపైగా పెట్టుబడులకు జారుకున్నాయి. పెట్రోలియం, రసాయనాలు, పెట్రో పెట్టుబడుల రీజియన్స్(పిసిపిఐఆర్) నుంచి నాడు ఒఎన్‌జీసి జారుకుంటే ... నేడు హెచ్‌పిసిఎల్ కన్సార్టియంలోని లక్ష్మీ మిట్టల్ ఆర్థిక మాంద్యంతో తప్పు కుంటున్నట్లు ప్రకటించారు.
హెచ్‌పిసిఎల్ కన్సార్టియంలో మరో కీలక భాగస్వామ్య సంస్థ, ఫ్రెంచ్‌కు చెందిన టోటల్ కూడా ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల రీత్యా ప్రాజెక్టులో కొనసాగలేమని తెలియచేసింది. దీంతో ప్రస్తుతం సదరు కన్సార్టియం సందిగ్ధంలో పడింది. ఈ కన్సార్టియం ద్వారా రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో రూ. 15 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ఫిల్డ్ రిఫైనరీ ప్రాజెక్టును ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. దీనిపై హెచ్‌పిసిఎల్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సార్టియంలోని మిట్టల్, టోటల్ కంపెనీలు జారుకున్నప్ప టికీ, తాము ఈ ప్రతిపాదన నుంచి బయటపడబోమని, ప్రత్యామ్నాయ భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
Pages: -1- 2 News Posted: 2 October, 2009
|