విప్రోతో చేయి కలిపిన జీఈ
అలాగే లైఫ్ సైన్సెక్స్, మెడికల్ డయాగ్నోస్టిక్స్ బిజినెస్ యూనిట్లు ప్రస్తుతం జీఈ హెల్త్‌కేర్‌కు చెందిన ఉత్పత్తులను పంపిణీ చేస్తోంది. ఈ ఉత్పత్తులు విప్రో జీఈ హెల్త్‌కేర్‌గా ఉత్పత్తి అవుతుంది. జీఈ మెడికల్ సిస్టమ్స్ ఇండియా మ్యానుఫ్యాచరీస్, ఎక్స్-రే మిషన్లు, ఇతర డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ఉత్పత్తులు, యాక్ససరీసులు అందిస్తారు. ‘ఈ రెండు సంస్థలు అన్నీ కోర్టు ఆమోదంపై ఆధారపడి ఉంటాయి. నా అంచనా ప్రకారం ఆరునెలల్లోగాని, ఏడాది కాలంలో వేగంగా విస్తరిస్తాం. ఆమోదాన్ని అనుసరించే ఎంత వేగంగా పని పూర్తవుతున్నది ఆధారపడి ఉం టుంది అని విప్రో హెల్త్‌కేర్ అధ్యక్షడు, సీఈఓ వీ రాజా అన్నారు. ఏకీకరణంలో భాగంగా దాదాపు 1,200 మంది ఉద్యోగులు జీఈ వివిధ హెల్త్‌కేర్ యూనిట్ల నుంచి జాయింట్ వెంచర్ సంస్థలోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే 800 మంది ఉద్యోగులను సంస్థ కలిగి ఉందని రాజా తెలిపారు. ఈ జాయింట్ వెంచర్‌లోని ప్రతి సంవత్సరం కొత్తగా 200 ఉద్యోగులను తీసుకుంటాం అన్నారు.
‘భారత్ ఔషధ పరికరాల మార్కెట్లో అధిక సామర్థ్యం కలిగి ఉంది ఇదే. దీని విలువ దా దాపు మూడు బిలియన్ డాలర్లు, క్రమంగా 12.13 శాతం వృద్ధి చెందు తుంది. ఈ వృద్ధి ఇలాగే కొనసాగుతుందని రాజా తెలిపారు. కార్డియాలజీ (ఈసీజీ మిషన్లు), ఇన్ఫెక్షన్ ట్రీట్‌మెంట్(సీటీ, ఎక్స్‌రే), ఇంక్యూబేటర్స్, వార్మర్స్ వేగంగా వృద్ధి చెందుతాయని కంపెనీ అంచనా వేస్తుంది. ‘1990 నుంచి జీఈ మా భాగ స్వామి. ప్రపంచంలోనే అత్యాధునికమైన, హెల్త్‌కేర్ పరికరాలను దక్షి ణాసియా కు జీఈ అందిస్తుందనే నమ్మకం ఉంది’ అని విప్రో చైర్మన్ ప్రేమ్‌జి అన్నారు.
భాగస్వామి కోసం జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) వేచిచూస్తోంది. తమ సంస్థకు చెందిన ఎన్‌బీసీ యూనివర్శల్‌కు నిధులను సమీకరించడంకోసం ఐపీఓను ప్రవేశపెట్టనున్నట్లు జీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫెరీ ఇమ్మెల్ట్ చె ప్పారు. అమెరికాకు చెందిన కేబుల్ ఆపరేటర్ కామ్‌కాస్ట్‌కు ఎన్‌బీసీలోని వాటా ను విక్రయించే ఆలోచనలో ఉన్నారా అనే ప్రశ్నకు ఇమ్మెల్ట్ సమాధానమిచ్చారు. ‘ఐపీఓను ప్రవేశ పెట్టాలా లేదా ఇతర సంస్థలను భాగస్వాములుగా చేర్చుకోవాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి’ అని ఆయన తెలిపారు. ఎన్‌బీసీలోని 51 శాతం వాటాను కామ్‌కాస్ట్‌కు అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కొన్ని పత్రికల కథనాల మేరకు ప్రచురిస్తున్నాయి. యూఎస్‌ఏ, బ్రావోతో పాటు ఎన్‌బీసీ యూనివర్శిల్ సొంత టెలివిజన్ నెట్‌వర్క్ ఉంది. ప్రాంతీయ టీవీ స్టేషన్లను, థీమ్ పార్క్‌లను, మూవీ స్టూడియోలను కలిగి ఉంది. బ్రిటిష్ డెయిలీ వెల్లడించిన పత్రికా కథనం మేరకు ఎన్‌బీసీలోని 20 శాతం వాటాను విక్రయించడానికి జీఈ చూస్తోంది. ఈ ఏడాది పూర్తి నాటికి ఈకార్యక్రమాలు పూర్తి కావచ్చని ప్రచురించింది.
Pages: -1- 2 News Posted: 3 October, 2009
|