రిలయన్స్ దీపావళి బోనస్
పదిహేను రోజుల క్రితం సమావేశమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సమావేశం 1:1 ఉచిత బోనస్ షేర్ల ఆఫర్ కు ఆమోదం తెలిపింది. కృష్ణా - గోదావరి బేసిన్ లో లభిస్తున్న గ్యాస్ విషయంలో అనిల్ అంబానీతో ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టులో తుదిదశకు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ సంస్థ వాటాదారులకు ఇంత భారీ మొత్తంలో ప్రయోజనం కలిగించడం గమనార్హం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇటీవలే విలీనమైన రిలయన్స్ పెట్రోలియం వాటాదారులకు కూడా ఈ దీపావళి బోనస్ వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. అయితే, రిలయన్స్ పెట్రోలియం నుంచి విడిపోయినందున, షేర్లేమీ లేనందున అనిల్ అంబానీకి ఈ బోనస్ వర్తించదని సంస్థ వర్గాలు స్పష్టం చేశాయి.
బోనస్, డివిడెండ్ అందజేసి ఖాతాదారులను గౌరవించడం ద్వారా రిలయన్స్ సంప్రదాయాన్ని కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. 2005లో సంస్థ విడిపోయినప్పటి నుంచీ 2,47,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిందని, 40 శాతం కాంపౌండ్ రిటర్నలు సంపాదించిందని స్పష్టం చేసింది. 'మా వాటాదారులకు బహుమతి ఇవ్వాలని మేం కృతనిశ్చయంతో ఉన్నాం' అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు.
Pages: -1- 2 News Posted: 8 October, 2009
|