నకిలీ నోట్ల పాట్లు
ప్రధానంగా 1000 రూపాయల నోట్లలో 2ఎక్యూ, 8ఎసి, 7ఎబి, 7ఎసి, 9ఎబి, 9ఎఎ, 9బివి, 2ఎయు సిరీసులను నకిలీ నోట్లుగా గుర్తించగా, 500 నోట్లకు సంబంధించి ఓఇపి, 6ఎబి, 6సిడబ్ల్యూ, 6బిసి, 6ఎబి, 6ఎసి, 7సిఎ, 7బిడి, 8బిపి, 8బిఎన్, 8పిక్యూ, 8బిసి, 8బిబి, 8డిపి, 8బిఎఫ్, 8సిఎన్, 8బిడి, 9బికె, 9ఎన్, 7ఎన్, 7ఎఆర్, 9పిఎన్, 9సిఎన్, 9ఒఎన్ సిరీస్ లను నకిలీవిగా నిర్థారించారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న నకిలీ కరెన్సీలో ఎక్కువగా 500 నోట్లే ఉంటున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ కరెన్సీ నోట్లు భారత, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లా కలియాచెక్ అనే ప్రాంతం నుంచి బంగ్లా శరణార్థుల రూపంలో మహిళల సహాయంతో ఈ కరెన్సీని ప్రవేశపెడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇక్కడ బంగ్లాదేశ్ తో ఇండియాకు దాదాపు 68 కిలోమీటర్ల సరిహద్దు రక్షణ లేకుండా ఉండడంతో నకిలీ నోట్లను భారత్ లోకి తరలించేందుకు మార్గం సులభమవుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఈ నకిలీ నోట్లను వాస్తవిక విలువపై 30 శాతానికి అసలు నోట్లను తీసుకొని సర్క్యులేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు రెండువేల కోట్ల రూపాయల విలువైన నకిలీ నోట్లను పాకిస్తాన్ గూఢచార సంస్థ దేశంలోకి ప్రవేశపెట్టినట్లు అంచనా. అయితే ప్రధానంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కరెన్సీనీ విధానంలో ఉన్న లోపాలు నకిలీ చెలామణికి ఊతంగా నిలుస్తున్నాయన్న ఆరోపణలు బ్యాంకింగ్ వర్గాల నుంచి విన్పిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 27 October, 2009
|