దేశంలో ఇక డిజిటల్ విద్య
తమ సంస్థ గడచిన రెండు సంవత్సరాలలో మెక్సికో, ఆస్ట్రేలియాలలో విజయవంతంగా డిజిటల్ విద్యా రంగంలోకి ప్రవేశించిందని, అత్యున్నత స్థాయి సర్వర్లతో వందలాది క్లాస్ రూములను అనుసంధానించిందని క్రెమెర్ తెలియజేశారు. 'భారతీయ విద్యా రంగంలో ఇదే విధంగా చేయవచ్చు' అని ఆయన సూచించారు.
ప్రస్తుతం దేశంలో విద్యా రంగంలో డెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పాఠశాలలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు 300పైగా ఉన్నట్లు నీరజ్ గుప్తా తెలియజేశారు. డెల్ ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో ఐటి సంక్లిష్టతను తగ్గిస్తూ విద్యా రంగానికి అత్యంత అనువైనదిగా ఉన్నట్లు, వీటిలో 'లాటిట్యూడ్ 2100' అనే మొబైల్ కంప్యూటింగ్ పరికరంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కావలసిన అప్లికేషన్ల తరహా, ఆవశ్యకతను బట్టి ఒక పాఠశాలలో లేదా కళాశాలలో 'డిజిటల్ ఏజ్ లెర్నింగ్ ఎకో-సిస్టమ్'ను ఏర్పాటు చేయడానికి 1000 డాలర్ల నుంచి 2000 డాలర్ల వరకు ఖర్చు కాగలదని క్రెమెర్ సూచించారు.
ప్రస్తుతం భారతీయ విద్యా రంగంలో డెల్ ఇండియాకు 11 శాతం మార్కెట్ వాటా ఉంది. 'విద్యా విభాగంలో ఐటిలో రెండంకెల వృద్ధి రేటు ఉంది. ఈ మార్కెట్ భారీ స్థాయిలో ఉంది' అని నీరజ్ గుప్తా చెప్పారు. తమ సంస్థ ముందుగా 50 వేల ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 5 November, 2009
|