షేర్లు అమ్మేసిన ఇన్ఫీ సుధ
స్టాక్ ఎక్స్ చేంజీల వద్ద గల సెప్టెంబర్ త్రైమాసికం షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, వాటాల అమ్మకానికి ముందు ఇన్ఫోసిస్ లో సుధామూర్తికి 1.62 శాతం, నారాయణమూర్తికి 0.55 శాతం మేర వాటాలు ఉన్నాయి. 'ప్రస్తుతానికి ఫండ్ కోసం మరింత మూలధనాన్ని సమీకరించే ఆలోచన వారికి లేదు' అని కూడా సంస్థ ప్రకటన తెలియజేసింది. ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి దంపతుల కుమార్తె అక్షతకు 1.41 శాతం, కుమారుడు రోహన్ కు 1.39 శాతం మేరకు వాటాలు ఉన్నాయి.
కాగా, గురువారం బిఎస్ఇలో ఇన్ఫోసిస్ షేర్ల లావాదేవీలు రూ. 2223.10 వద్ద ముగిసాయి. అంతకుముందు కన్నా 0.74 శాతం తగ్గుదల ఉన్నది. ఇది ఇలా ఉండగా, వేరే లావాదేవీగా ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.గోపాలకృష్ణన్ గురువారం రూ. 86.60 కోట్లు విలువ చేసే నాలుగు లక్షల సంస్థ వాటాలను అదనంగా కొనుగోలు చేశారు. ఆయనకు సెప్టెంబర్ 30 వరకు సంస్థలో 1.09 శాతం మేరకు వాటాలు ఉన్నాయి.
నారాయణమూర్తి విసి ఫండ్ ను 'కాటమరాన్'గా పేర్కొంటారు. ఈ ఫండ్ ను నిర్వహించేందుకు అత్యున్నత ప్రతిభావంతుల బృందాన్ని ఎంపిక చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. వచ్చే కొన్ని నెలలలో ఇది కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఈ విసి ఫండ్ తో నారాయణమూర్తి ఇటువంటి సంస్థను ప్రారంభించిన విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ మార్గాన్ని అనుసరించినవారవుతారు. ప్రేమ్ జీ ఇంతకుముందే 'ప్రేమ్ జీ ఇన్వెస్ట్' అనే ప్రైవేట్ ఈక్విటీ పండ్ ను నిర్వహిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 6 November, 2009
|