'రియల్'కు లాంకో గుడ్ బై
క్రితం సంవత్సరం మార్కెట్ మాంద్యం సమయంలో హైదరాబాద్ లో తన రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లకు సంబంధించి సంస్థ దాదాపు 250 కస్టమర్లను నష్టపోయింది. అపార్ట్ మెంట్ల నిర్మాణం కోసం కావలసిన మొత్తంలో 40 శాతాన్ని చెల్లించిన తరువాత కస్టమర్లు బుకింగ్ లను రద్దు చేసుకున్నారు. వారిలో చాలా మంది ప్రవాస భారతీయులే. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు సుమారు కోటిన్నర రూపాయలు ఉంటుంది. కస్టమర్లు వెనుకకు తగ్గడంతో సంస్థ ఈ ప్రాజెక్టును మందగింపజేసింది.
ప్రస్తుతం సంస్థ 950 మెగావాట్ల మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నదని వెంకటేష్ బాబు తెలియజేశారు. ఇందులో 368 మెగావాట్ల మేరకు రాష్ట్రంలోని కొండపల్లి ప్రాజెక్టులోను, 300 మెగావాట్ల మేరకు ఛత్తీస్ గఢ్ లోని అమర్ కంటక్ లోను, 120 మెగావాట్ల మేరకు అబన్ ప్రాజెక్టులోను విద్యుదుత్పత్తి జరుగుతోంది.
రెండు సంవత్సరాలలో ఈ విద్యుదుత్పాదక సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచాలని సంస్థ ఆశిస్తున్నది. ఇంకా రాబోతున్న అల్ట్రా మెగా విద్యుత్ ప్రాజెక్టుల (యుఎంపిపి) కోసం ఒంటరిగా బిడ్డింగ్ చేయాలని కూడా సంస్థ యోచిస్తున్నది. సంస్థ మలేషియా సంస్థ గెంటింగ్ తో కలసి తిలైయాలో యుఎంపిపి కోసం బిడ్ చేసింది. కాని ఆతరువాత ఆ బిడ్ ను అవి ఉపసంహరించుకున్నాయి.
Pages: -1- 2 News Posted: 9 November, 2009
|