మళ్ళీ పెరిగిన కార్ల డిమాండ్
ఇంతకు ముందు త్రైమాసిక కాలాల్లో పెరిగిన డిమాండ్, వాహనాల రుణాలపై బ్యాంకులు ఆఫర్ చేస్తున్న ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఉత్పత్తిదారులు ఇవ్వజూపుతున్న డిస్కౌంట్లు, ఇతర ఆర్థిక రాయితీలు, రానున్న మాసాలలో ఆటోమొబైల్ ధరలు, రుణాల రేట్లు పెరుగుతాయేమోననే భయం ఫలితంగానే కార్ల అమ్మకాలు పెరిగాయని మోటార్ వాహనాల ఉత్పత్తి, విక్రయ సంస్థలు చెబుతున్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన కార్ల రుణ సహాయక అనుబంధ సంస్థ కోటక్ మహీంద్రా ప్రైమ్ రెండు వారాల క్రితం వాహనాల రుణాలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అయినప్పటికీ డిమాండ్ పై అది ప్రభావం చూపలేదు. కోటక్ మహీంద్ర ప్రైమ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) సుమీత్ బాలి ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'పండుగల తరువాత కూడా ఈ సంవత్సరం డిమాండ్ కొనసాగుతోంది. వాహనాలు తీసుకువెళ్ళడం కూడా పెరిగింది. వడ్డీ రేట్లు ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. రానున్న మాసాలలో ఇవి అంతగా పెరగకపోవచ్చు. అయినా అది డిమాండ్ ను తగ్గించకపోవచ్చు' అని వివరించారు.
ద్విచక్ర వాహనాల మార్కెట్ కూడా వెనుకబడిలేదు. హీరో హోండా, బజాజ్ ఆటో కూడా చాలా సంవత్సరాల తరువాత నిరీక్షణ కాలాన్ని సూచిస్తున్నాయి. పండుగల ఉత్సాహం కొనసాగుతోందని, నవంబర్ లో డిమాండ్ అధికం కావడం దీనిని సూచిస్తున్నదని చెప్పారు. 'ఈ సంవత్సరం మేము నలబై లక్షల వాహనాలను అమ్ముతామని లోగడ ప్రకటించాం. కాని ఇప్పుడు ఆ లక్ష్యాన్ని అవలీలగా అధిగమిస్తామని మేము దృఢవిశ్వాసంతో చెబుతున్నాం' అని తెలిపారు.
డీజిల్ కార్లకు నిరీక్షణ వ్యవధి కూడా 'విపరీత స్థాయిలో' ఉందని డీలర్లు చెబుతున్నారు. స్విఫ్ట్ జైరీ డీజిల్ మోడల్ కోసం మూడు నెలలకు పైగా నిరీక్షించవలసి వస్తున్నది. స్విఫ్ట్, రిట్జ్ డీజిల్ మోడల్స్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
Pages: -1- 2 News Posted: 13 November, 2009
|