అమ్మకానికి సెయిల్
లిస్ట్ అయిన ఎన్ టిపిసిలో 5 శాతం వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 8100 కోట్లు ఆర్జించవచ్చునని కార్యదర్శి చెప్పారు. వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను జాతీయ పెట్టుబడుల నిధి (ఎన్ఐఎఫ్)లో మురగబెట్టే బదులు సామాజిక రంగ ప్రాజెక్టులపై వెచ్చించడానికి ప్రభుత్వం ఈ నెల 5న అనుమతి ఇచ్చింది. గడచిన మూడు సంవత్సరాలలో లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ స్టాక్ ఎక్స్ చేంజ్ లలో తప్పనిసరిగా లిస్ట్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
తమ వాటాలలో కనీసం పది శాతాన్ని పబ్లిక్ ఆఫర్ కు ప్రత్యేకించాలని లాభాలు ఆర్జిస్తున్న, లిస్టయిన సంస్థలను ప్రభుత్వం కోరింది. 'ఈ 60 సంస్థల విషయమై మేము పలు అడ్మినిస్ట్రేటివ్ మంత్రిత్వశాఖలతో మాట్లాడుతున్నాం. అయితే, వీటిలో వాటాలు విక్రయించబోతున్నామని దీనికి అర్థం తీసుకోరాదు. ఇదంతా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది' అని కార్యదర్శి వివరించారు. సెయిల్, కోల్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ సంస్థలలోవాటాల విక్రయానికి గల అవకాశాల అన్వేషణకై తాను ఉక్కు, బొగ్గు, టెలికామ్ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు మిత్రా తెలియజేశారు.
గత 16 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అధికంగా రూ. 4 లక్షలకు పైగా లేదా జిడిపిలో 6.8 శాతం మేర ద్రవ్య లోటు ఉండగలదని బడ్జెట్ సూచించింది. ఈ లోటును కొంత వరకు పూడ్చడానికి ఈ వాటాల విక్రయం దోహదం చేయగలదు.
Pages: -1- 2 News Posted: 14 November, 2009
|