రిలయన్స్'చిల్లర' చిల్లు
కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఆఫర్లు ఇవ్వడం, ప్రైవేట్ లేబుల్స్, 'వెచ్చించే డబ్బుకు తగిన వస్తువులు ఇవ్వడం' వంటి పద్ధతులతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆర్ఆర్ ఒక ప్రణాళికను రూపొందించగా సంస్థ వాటాదారులు మాత్రం సంస్థలో ఈక్విటీగా మదుపు చేసిన రూ. 4051 కోట్లలో అంతకంతకు ఎక్కువ భాగం అనుబంధ సంస్థల్లో పేరుకుపోతున్న నష్టాల రూపంలో హరించుకుపోతున్నదని భావిస్తున్నారు.
ఆహారం, కిరాణా సరకుల స్పెషాలిటీ స్టోర్, ఎలక్ట్రానిక్స్ స్పెషాలిటీ స్టోర్, పాదరక్షల స్పెషాలిటీ స్టోర్, దుస్తుల స్పెషాలిటీ స్టోర్ వంటి విభాగాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు అన్నీ 2008 - 09 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు చవి చూశాయి. స్ట్రాటెజిక్ మాన్ పవర్ సొల్యూషన్స్ (ఎస్ఎంఎస్) వంటి అనుబంధ వ్యాపార సంస్థలకు కూడా రూ. 10.24 కోట్ల మేరకు నష్టాలు వాటిల్లాయి. రిలయన్స్ ట్రేడ్ సర్వీసెస్ సెంటర్ కు రూ. 21.23 కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి. రీటైల్ వ్యాపారానికి సంబంధించిన సప్లయి లావాదేవీలు చూసే కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
రిలయన్స్ అగ్ర ప్రోడక్ట్స్ డివిజన్ రూ. 7.83 కోట్లు, రిలయన్స్ ఫుడ్ ప్రోసెసింగ్ సొల్యూషన్స్ రూ. 37.34 కోట్లు, రిలయన్స్ సప్లయి చైన్ సొల్యూషన్స్ రూ. 12.9 కోట్ల మేరకు నష్టాలు చవి చూశాయి. కస్టమర్లతో సంబంధాలకు సంబంధించిన సంస్థ రిలయన్స్ వన్ కు అండగా ఉన్న రిలయన్స్ లాయల్టీ అండ్ అనలిటిక్స్ వంటి సంస్థలకు కూడా మార్చి వరకు రూ. 6.44 కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి.
రిటైల్ వ్యాపారంలో పెరుగుతున్న నష్టాల కారణంగా అంబానీ ఈ వ్యాపారానికి సంబంధించి తన లక్ష్యాన్ని కుదించుకున్నట్లు తెలుస్తున్నది. తన ఆయిల్, పెట్రో కెమికల్స్ సంస్థలకు ఆయన మరింతగా ప్రాముఖ్యం ఇవ్వవచ్చు. అయితే, కుమార్ మంగళం బిర్లా ఆధిపత్యంలోని ఆదిత్య బిర్లా రిటైల్ వంటి ఇతర బడా వాణిజ్యవేత్తల కుటుంబాలు కూడా నష్టాలకు గురవుతున్నారని, వారు తమ వ్యాపార పద్ధతులను, స్థాయిని, సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|