11వేల రన్స్ క్లబ్ లో ద్రవిడ్

అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టులో మిస్టర్ వాల్ గా ప్రసిద్ధుడైన రాహుల్ ద్రవిడ్ 11వేల పరుగుల క్లబ్ లో చేరాడు. తద్వారా రాహుల్ అలెన్ బోర్డర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, సచిన్ టెండుల్కర్ ల సరసన చేరాడు. అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజున ద్రవిడ్ 177 పరుగులు చేయగానే ఈ రికార్డును చేరుకున్నాడు. కాగా, 11వేల పరుగుల రికార్డును చేరుకున్న భారత బ్యాట్స్ మెన్ లో రాహుల్ ద్రవిడ్ రెండో వాడుగా నిలిచాడు.
ఇలా ఉండగా శ్రీలంకతో మూడు టెస్ట్ మ్యాచ్ సీరీస్ లో భాగంగా సోమవారం ప్రారంభమైన తొలి మ్యాచ్ లో తన తొలి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 385 పరుగులు చేసింది. మిస్టర్ వాల్ రాహులు ద్రవిడ్ 177 పరుగులతోను, హర్భజన్ సింగ్ 2 పరుగులతోనూ నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు.
టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ లను ఓపెనింగ్ బ్యాట్స్ మెగా పంపించాడు. ఆట 2.5వ ఓవర్ వద్ద జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద గౌతం గంభీర్ పది బందులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి వెలెగెదరకు క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 6.1వ ఓవర్ వద్ద అదే వెలెగెదర బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యుగా వికెట్ ను అప్పగించాడు. అప్పటికి జట్టు స్కోర్ 27, వీరు స్కోర్ 16 పరుగులు ఉంది.
Pages: 1 -2- News Posted: 16 November, 2009
|