11వేల రన్స్ క్లబ్ లో ద్రవిడ్
గంభీర్ అవుట్ అవడంతో వన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన రాహుల్ ద్రావిడ్ తన సార్థక నామధేయాన్ని మరోసారి నిరూపించుకుంటూ రోజంతా అక్కడే అంటిపెట్టుకుపోయాడు. 251 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 26 బౌండరీలతో 177 పరుగులు చేసి, నాటౌట్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ అవుటైన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన సచిన్ టెండుల్కర్ వ్యక్తిగత స్కోర్ 4 పరుగుల వద్ద, సచిన్ స్థానంలో వచ్చిన వివిఎస్ లక్ష్మణ్ పరుగులేవీ చేయకుండానే వెనుదిరిగారు. అనంతరం మైదానంలోకి వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. అయితే, ఆట 36.1వ ఓవర్ వద్ద ముత్తయ్య మురళీధరన్ బంతిని దిల్షాన్ చేతికి క్యాచ్ ఇచ్చి తన వ్యక్తిగత స్కోర్ 68 పరుగుల వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. యువీ స్కోర్ లో 13 బౌండరీలున్నాయి. అప్పటికి భారత స్కోర్ 157 పరుగులు ఉంది. రాహుల్, యువీ జంట విడిపోవడంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దిగాడు. రాహుల్ - ధోనీ వికెట్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ చెరో సెంచరీ పూర్తి చేశారు. అయితే, ఆట 87.1వ ఓవర్ లో దమ్మకి ప్రసాద్ బంతికి దొరికిపోయి పి. జయవర్దనేకి క్యాచ్ ఇచ్చుకున్నాడు. ధోనీ 110 పరుగుల్లో ఒక సిక్సర్, 10 బౌండరీలున్నాయి. అప్పటికి భారత్ స్కోర్ 381 పరుగులు. ధోనీ స్థానంలో హర్భజన్ సింగ్ బ్యాటింగ్ కు దిగాడు. 11 బంతులు ఎదుర్కొని బజ్జీ 2 పరుగులు చేశాడు. అదే సమయానికి రాహులు 177 పరుగులు చేశాడు. అప్పటికి 90 ఓవర్లూ పూర్తవడంతో తొలిరోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. రాహుల్ ద్రవిడ్, బజ్జీ నైట్ వాచ్ మెన్ గా నిలిచారు.
శ్రీలంక బౌలింగ్ లో చణక వెలెగెదర 3 వికెట్లు పడగొట్టాడు. దమ్మిక ప్రసాద్ రెండు వికెట్లు, ముత్తయ్య మురళీధరన్ ఒక వికెట్ తీసుకున్నారు.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|