కుబేరుల్లో టాప్ ముఖేష్
ఫోర్బ్స్ ఇండియా ఎడిటర్ ఇంద్రజిత్ గుప్తా మాట్లాడుతూ, 'వ్యాపార సామర్థ్యం ప్రదర్శనకు కావలసిన మూలధనం ఇండియాలో సమృద్ధిగా ఉన్నదని దీని వల్ల విదితమవుతున్నది. వివిధ రంగాలలోని పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు చేసుకున్నారు' అని పేర్కొన్నారు. కాగా, సునీల్ మిత్తల్ నాలుగవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానానికి పతనం కాగా అజీమ్ ప్రేమ్ జీ నాలుగవ స్థానానికి పురోగమించారు. 13.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో రూయా సోదరులు ఈ సంవత్సరం ఐదవ స్థానం ఆక్రమించారు. ఈ జాబితాలోకి కొత్తగా టారెంట్ పవర్ సంస్థకు చెందిన అన్నదమ్ములు సుధీర్, సమీర్ మిశ్రా చేరారు. వారు 2.02 బిలియన్ డాలర్లతో 23వ స్థానం పొందారు.
2009 ఇండియాలో సంపన్నులకు ఎలా లాభదాయక సంవత్సరంగా మారిందో ఫోర్బ్స్ ఇండియా పత్రిక ముఖచిత్ర కథనం వివరిస్తున్నది. ప్రపంచంలో ఇతర ప్రాంతాలలోని బిలియనీర్ల కన్నా భారతీయ బిలియనీర్లు తమ స్థితిని ఎలా మెరుగుపరచుకున్నారో ఈ జాబితా సూచిస్తున్నది. అత్యంత సంపన్నులైన ముగ్గురు భారతీయుల సంపద మొత్తం 79.5 బిలియన్ డాలర్లు. చైనాలో 24 మంది బిలియనీర్ల మొత్తం సంపద 80 బిలియన్ డాలర్లు.
ఇండియాలోని టాప్ 10 సంపన్నులు : 1. ముఖేష్ అంబానీ 32 బిలియన్ డాలర్లు 2. లక్ష్మీ మిత్తల్ 30 బిలియన్ డాలర్లు 3. అనిల్ అంబానీ 17.5 బిలియన్ డాలర్లు 4. అజీమ్ ప్రేమ్ జీ 14.9 బిలియన్ డాలర్లు 5. శశి, రవి రూయా 13.6 బిలియన్ డాలర్లు 6. కె.పి. సింగ్ 13.5 బిలియన్ డాలర్లు 7. సావిత్రీ జిందాల్ 12 బిలియన్ డాలర్లు 8. సునీల్ మిత్తల్ 8.2 బిలియన్ డాలర్లు 9. కుమార్ బిర్లా 7.8 బిలియన్ డాలర్లు 10. గౌతమ్ అదానీ 6.4 బిలియన్ డాలర్లు
Pages: -1- 2 News Posted: 19 November, 2009
|