19 చెల్లిస్తే మీ నెంబర్ మీదే!
అంతర్జాతీయ టెలికామ్ ఆపరేటర్లు టెలినార్, ఎటిసలాట్, బాటెల్కోతో సహా నాలుగు కొత్త సంస్థలు ఈ సంవత్సరం ఇండియాలో తమ సేవలను ప్రారంభించబోతున్నాయని, ఇప్పుడున్న వినియోగదారులను తమ వైపు ఆకర్షించుకోవడానికి వాటికి ఎంఎన్ పి చక్కటి అవకాశం కల్పిస్తున్నదని టెలికామ్ రంగం పనితీరును పరిశీలిస్తున్న ఒక అనలిస్ట్ చెప్పారు. 'ఏ తరహా నంబర్ పోర్టబిలిటీలోనైనా ప్రధానంగా నష్టపోయేది భారీ సంస్థలే. అయితే, కొత్త సంస్థలు గణనీయంగా లాభపడే అవకాశం ఉంది' అని ఆయన సూచించారు. 'సుమారు 2 నుంచి 3 శాతం మంది వినియోగదారులు ఇలా సర్వీస్ ను మార్చుకోవచ్చు' అని ఆ అనలిస్ట్ సూచించారు.
'తమ మొబైల్ ఫోన్ నంబర్లను మార్చుకోకుండానే సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునేందుకు వినియోగదారులకు నంబర్ పోర్టబిలిటీ వల్ల వీలు కలుగుతుంది కనుక రేట్లలో మార్పులను కూడా ఇది తీసుకురావచ్చు' అని ఒక టెలికామ్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు సూచించారు. అయితే, 'చార్జీలను తగ్గించేట్లు ఒత్తిడి తీసుకురావడానికి, ఎక్కువ మంది ఆపరేటర్లకు లైసెన్సులు ఇవ్వడానికి రెగ్యులేటర్లు దీనిని ఒక సాధనంగా ఉపయోగించుకునే అవకాశం ఉండడం వల్ల ఆపరేటర్లు ఆందోళనకు గురి కావచ్చు' అని ఆ అధికారి అన్నారు.
కాగా, పరికరాల ఖర్చులతో సహా ఎంఎన్ పి విధానం అమలుకు ఆపరేటర్లు మరింతగా ఖర్చు చేయవలసి రావచ్చు.
Pages: -1- 2 News Posted: 21 November, 2009
|