దుబాయి ప్రకంపనలు
అయితే భారత్ ఆర్ధిక రంగంపై దుబాయ్ వరల్డ్ చూపించే ప్రభావాన్ని గురించి అప్పుడే అంచనాలకు రావడం తొందరపాటే అవుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. భారత్ ఆర్ధిక వ్యవస్థపై, ప్రజలపై, కార్పోరేట్ కంపెనీలపై దీని ప్రభావం గురించి పరిశీలించవలసి ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ చావ్లా వ్యాఖ్యానించారు. దుబాయ్ వరల్డ్ తో ముడిపడి ఉన్న అంశాలేమిటి? సమస్యలు ఏమిటి? ఎదురయ్యే సవాళ్ల అవకాశం ఎంత? అన్న విషయాలను సమగ్రంగా అధ్యాయం చేయవలసి ఉందని ఆయన చెప్పారు.
కాగా భారత్ రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారుల్లో అత్యధికులు దుబాయ్ బుడగ పేలినా తమకు వచ్చే ముప్పేమీ లేదని ఢంకా బజాయిస్తున్నారు. దేశీయ స్థిరాస్థి మార్కెట్ పై దాని ప్రభావం ఉండబోదని చెబుతున్నారు. డిఎల్ ఎఫ్, యునిటెక్, పార్శ్వనాథ్, ఎమార్ ఎంజిఫ్ గ్రూపులు దుబాయితో ఎలాంటి ప్రమేయం పెట్టుకోలేదు. ఒమాక్స్ మాత్రం 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. దానిని కూడా తిరిగి ఇచ్చేయమని కోరుతోంది.
కార్పోరేట్ రుణ చెల్లింపుల విషయంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెబుతున్నారు. భారతీయ స్థిరాస్థి మార్కెట్ చాలావరకూ అంతర్గత డిమాండ్ పైనే ఆధారపడిందని, అందువల్ల తమపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదని డిఎల్ఎఫ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాజీవ్ తల్వార్ చెప్పారు.
ఇక ప్రభుత్వ వైఖరి విషయానికి వస్తే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద శర్మ దుబాయ్ ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పారు. భారతీయ ఆర్ధిక రంగం చాలా విస్తృతమైనదని, ఎదో దుబాయి రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపు వస్తే దాని ప్రభావం ఇక్కడ ఉండే అవకాశం చాలా తక్కువని ఆయన అన్నారు.
Pages: -1- 2 News Posted: 27 November, 2009
|