'సెల్' గగ్గోలు
కాగా డిస్కనెక్షన్ గురించి తమ కస్టమర్లకు తమ సంస్థ ఇప్పటికే సమాచారం అందజేసిందని ఒక మొబైల్ ఆపరేటర్ వద్ద పని చేసే అధికారి ఒకరు తెలిపారు. ఆయన తన పేరు వెల్లడి చేయవద్దని కోరారు.
అటువంటి కస్టమర్లను టెలికామ్ సంస్థలు గుర్తించి, ఎస్ఎంఎస్ లను పంపుతున్నాయి లేదా కాల్స్ చేస్తున్నాయి. తమ ఫోన్లలో ఐఎంఇఐ నంబర్ నిక్షిప్తం చేయించుకోవడానికి నిర్దేశిత ఔట్ లెట్లకు వెళ్ళవలసిందిగా అవి తమ కస్టమర్లకు సలహా ఇచ్చాయి. హ్యాండ్ సెట్ లో ఈ నంబర్ ను నిక్షిప్తం చేయించుకోవడానికి కేవలం రూ. 199 ఖర్చవుతుంది. హ్యాండ్ సెట్ లో ఈ నంబర్ నిక్షిప్తం అయిన తరువాతే కనెక్షన్ పునరుద్ధరణ జరుగుతుంది.
జిఎస్ఎం ఆపరేటర్ల లాబీ అయిన సిఒఎఐ తన సభ్యుల భాగస్వామ్యంతో ఇందు నిమిత్తం దేశవ్యాప్తంగా 1600 ఔట్ లెట్లను నిర్వహిస్తున్నది. 'ఈ కార్యక్రమం మొదలైంది. నంబర్ ను నిక్షిప్తం చేయించుకోవడానికి రోజూ దాదాపు 20 మంది వినియోగదారులు వస్తున్నారు' అని దువా తెలియజేశారు. ఫోన్ వినియోగదారుల స్పందన సకారాత్మకంగా ఉందని ఆయన చెప్పారు.
అయితే, ఆపరేటర్ల స్పందన అత్యల్పంగా ఉంది. పైగా ఇప్పటికే కాలహరణం కూడా జరిగింది. గడువును సాధ్యమైనంతగా పొడిగించుకోవడానికి వారు ప్రధానంగా ప్రయత్నించారు. ఈ నంబర్ లేని హ్యాండ్ సెట్లను డిస్కనెక్ట్ చేసేందుకు డిఒటి తొలుత జూన్ 30ని గడువుగా నిర్దేశించింది. కాని, ఒత్తిడి రావడంతో గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. డిఒటి సెప్టెంబర్ లో వారికి గడువు గురించి మరొకసారి గుర్తు చేసింది.
కాని, రోజుకు 20 హ్యాండ్ సెట్ల లో మాత్రమే ఐఎంఇఐ నంబర్ నిక్షిప్తం చేస్తుంటే 17 మిలియన్ల పైచిలుకు హ్యాండ్ సెట్లన్నిటిలో ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేను?
Pages: -1- 2 News Posted: 1 December, 2009
|