కేసీఆర్ దీక్షతో సినీ కష్టాలు!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/TRS1.jpg' align='left' alt=''>తెరాస అధ్యక్షుడు కేసిఆర్ నిరాహార దీక్ష అధికార పార్టీ వారిని కంటికి కునుకులేకుండా చేస్తోంది. అంతేనా? తెలుగు సినీ పరిశ్రమ కూడా కేసీఆర్ ఆరోగ్యం కోసం కోటినొక్క దేవుళ్లకు మొక్కుకుంటోంది. కేసిఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం, రోజురోజుకూ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్టు వస్తున్న వార్తలు, రెండు రోజుల బంద్, ఉద్రిక్త పరిస్థితులు, ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న తమ కొత్త చిత్రాల భవితవ్యంపై నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మూడు పెద్ద చిత్రాల నిర్మాతల పరిస్థితి అయోమయంలో పడింది.
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/adurs-saleem.jpg' align='right' alt=''>డాక్టర్ ఎం.మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణువర్దన్ బాబు కథానాయకుడుగా 'సలీమ్' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. సరైన హిట్ కోసం తపిస్తున్న విష్ణువర్దన్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో 23 కోట్ల భారీ బడ్జెట్ తో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 11న ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. కేసీఆర్ ప్రభావం పడే అవకాశాలున్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ జూనియర్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన 'అదుర్స్' సైతం ఇదే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. కేసీఆర్ దీక్ష అనంతరం తలెత్తిన ఆందోళనల ప్రభావం ఈ చిత్రం బాక్సాఫీస్ ఫలితంపై పడే అవకాశాలు లేకపోలేదు. ఈ రెండు చిత్రాలతో పాటు డాక్టర్ డి.రామానాయుడు మనువడు రానాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ నిర్మించిన 'లీడర్' సైతం ఇదే నెలలో రిలీజ్ ను టార్గెట్ గా చేసుకుంది. అసలే ఈ ఏడాది సరైన హిట్లు లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ సైతం ఈ భారీ బడ్జెట్ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ తరణంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఆయా చిత్రాల నిర్మాతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా 30 శాతం వరకూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గినట్టు హైద్రాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం.విజయేందర్ రెడ్డి వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 8 December, 2009
|