కేసీఆర్ దీక్షతో సినీ కష్టాలు!
తెలంగాణలో 600 థియేటర్లు ఉండగా, వాటిలో 200 థియేటర్లు హైద్రాబాద్ లోనూ, మిగతావి రంగారెడ్డి జిల్లాలోనూ ఉన్నాయి. నైజాం ఏరియాతో పాటు కర్నాటక, మహారాష్ట్ర ఏరియాల రెవెన్యూను నిర్మాతలు కీలకంగా భావిస్తుంటారు. సినీ పరిశ్రమపై కేసీఆర్ ఇప్పటికే తన పదునైన అస్త్రాలు ప్రయోగించారు. తెలంగాణా భాషను అపహాస్యం చేసే విధంగా పాత్రలను సృష్టిస్తే సహించేది లేదని ఫిల్మ్ మేకర్స్ కు ఆయన గతంలో హెచ్చరికలు జారీచేసారు. పదేపదే తెలంగాణకు చెందిన వ్యక్తినే విలన్ గా చూపించే ప్రక్రియను ఇంకెంత మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. 'కరడుకట్టిన విలన్లను హీరోలు తెరపై తుక్కుతుక్కు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు కెసిఆర్ ఓ పెద్ద విలన్ గా కనిపించొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యం తప్పకపోవచ్చు' అని ఓ ప్రముఖ నిర్మాత వ్యాఖ్యానించారు. ఇందువల్ల పెద్ద ఆర్టిస్టుల కెరీర్ దెబ్బతినడంతో పాటు నిర్మాతలు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినీ ఎకనామిక్స్ ప్రకారం....ఒక సినిమా నిర్మాణం పూర్తయిన వెంటనే రిలీజ్ కు రావాల్సి ఉంటుంది. విడుదలలో ఎలాంటి జాప్యం జరిగినా నిర్మాతలు వడ్డీల చెల్లింపు రూపంలో కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే కొంతమంది నిర్మాతలు ముందుగా ప్రకటించిన ప్రకారమే కొత్త రిలీజ్ లకు సమాయత్తమవుతున్నారు. ప్రతి శుక్రవారంనాడు కనీసం మూడు రిలీజ్ లు ఉండేలా చూసుకుంటున్నారు. జగపతిబాబు 'ప్రవరాఖ్యుడు', అజయ్ 'సారాయి వీర్రాజు', 'మన్మథులు' చిత్రాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. దానికి ఒకరోజు ముందుగా 'అమరావతి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 11న మరో మూడు చిత్రాలు (సలీమ్..వాడేకావాలి...కథ) విడుదలకు సిద్ధమవుతున్నాయి. సో...బాక్సాఫీస్ ను శాసించగలమని గట్స్ గా చెప్పే రీల్ హీరోలు... బయట్నించి 'మజిల్' పవర్ చూపుతున్న వారిపై ఏవిధంగా నెగ్గుకొస్తారా అనేది ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది.
కొసమెరుపు: తెలంగాణపై 'కేంద్ర' పాలకులు దిగిరాకుండే 'ఆంధ్ర' నిర్మాతల చిత్రాలు నైజాంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామంటూ తెలంగాణా విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) హెచ్చరించింది.
Pages: -1- 2 News Posted: 8 December, 2009
|