బ్యాంకు సిబ్బందికీ పెన్షన్
పిఎన్ బి, బిఒబి, యుబిఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు పిఎఫ్ఆర్ డిఎతో ఒప్పందంలో భాగం కాగా ఇందులో చేరిన కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులలో కర్నాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఐఎన్ జి వైశ్యా బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, ధనలక్ష్మీ బ్యాంక్, కేథలిక్ సిరియన్ బ్యాంక్ కూడా ఉన్నాయి.
బ్యాంకులు, ఉద్యోగులు ఎన్ పిఎస్ కోసం 10 శాతం వంతున సమకూర్చవలసి ఉంటుందని ఐబిఎ సిఇఒ కె. రామకృష్ణ తనను సంప్రదించిన ఎఫ్ సి విలేఖరితో చెప్పారు. 'బ్యాంకు, ఉద్యోగులు సమకూర్చిన మొత్తం ఎన్ పిఎస్ కు చేరినప్పుడు మా బాధ్యత ముగుస్తుంది' అని రామకృష్ణ చెప్పారు. 'అలా బదలాయించే మొత్తం ఎంత అనేది ఈ విధానంలో చేరే వారి సంఖ్యను బట్టి ఉంటుంది' అని రామకృష్ణ పేర్కొన్నారు.
టయర్ 1 (విత్ డ్రా చేయదగిన) సబ్ స్క్రిప్షన్ సౌకర్యాన్ని టైర్ 2 (విత్ డ్రా చేయదగిన) సబ్ స్క్రిప్షన్ సౌకర్యాన్ని ఎన్ పిఎస్ కల్పిస్తున్నది. ఆరుగురు పెన్షన్ ఫండ్ మేనేజర్లలో ఎంపిక చేసిన ఒక పెన్షన్ ఫండ్ మేనేజర్ ఆ సబ్ స్క్రిప్షన్ ల వ్యవహారాలు నిర్వహిస్తారు.
Pages: -1- 2 News Posted: 16 December, 2009
|