'3 ఇడియట్స్' తగవులాట
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/chetan-ameer.jpg' align='right' alt='Chetan Bhagat - Ameer Khan'>న్యూఢిల్లీ: క్రిస్మస్ కు విడుదలైన అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తున్న తరుణంలో ఊహించని వివాదం చుట్టుముట్టింది. సినిమా స్క్రిప్టు తానురాసిన 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల లోనిదేనని రచయిత చేతన్ భగత్ ఈ వివాదానికి అంకురార్పణ చేశారు. ఆయన వాదన హీరో అమీర్, నిర్మాత విధు వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీలకు మింగుడు పడటం లేదు. నొయిడాలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ అంశం ప్రస్తావన రావడం, చోప్రా పాత్రికేయులతో తగవు పడటం, ఆ తర్వాత అమీర్ వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేశాయి.
టైటిల్ క్రెడిట్ విషయంలో 'ఇడియాటిక్' వివాదం మొదలైంది. ఈ చిత్ర కథను అభిజిత్ జోషి, హిరానీ రాసినట్టు టైటిల్ కార్డ్స్ వేశారు. సినిమా చివర్లో భగత్ పేరు వేశారు. దీంతో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదంటూ భగత్ వాపోతున్నారు. దీనికితోడు ఈ సినిమా స్క్రిప్టు రైటర్ జోషి అనీ, అతన్నించి ఆ క్రెడిట్ కొట్టేయాలని భగత్ ప్రయత్నిస్తున్నారంటూ అమీర్ చేసిన వ్యాఖ్య ఆయనకు మరింత ఆవేదనకు గురిచేస్తోంది. తప్పుడు ఆరోపణలు చేస్తున్న భగత్ పై పరువునష్టం కేసు వేయాలని చోప్రా, ఇరానీలకు అమీర్ సలహా ఇచ్చినట్టు కూడా వార్తాకథనాలు వచ్చాయి. ఈ వార్తలపై భగత్ స్పందిస్తూ 'ఐదేళ్లుగా హిరానీ, విధు వినోద్ చోప్రా, అమీర్ లను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు లీగల్ నోటీస్ ఇస్తామంటూ బెదరిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు నేను కూడా సిద్ధంగానే ఉన్నాను' అని స్పష్టం చేశారు.
Pages: 1 -2- News Posted: 2 January, 2010
|