'3 ఇడియట్స్' తగవులాట
చోప్రా సైతం శుక్రవారంనాడు ఈ వివాదానికి ఆజ్యం పోశారు. నొయిడాలో జరిగిన ప్రెస్ మీట్ లో ఓ పాత్రికేయుడు ఈ వివాదంపై అడిగిన ప్రశ్నకు చోప్రా 'నువ్వు ఆ నవల చదివావా? నేను చదివాను. నోరుమూసుకో' అని చోప్రా గుడ్లురిమారు. తన నవలకు పబ్లిసిటీ తెచ్చుకునేందుకు చోప్రా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై భగత్ సైతం వెంటనే స్పందించారు. ఇలాంటి పబ్లిసిటీ తనకు అవసరం లేదనీ, తన నవలను చదివిని లక్షలాది మంది సదరు సినిమా స్క్రిప్టు 'ఎత్తిపోతల' వ్యవహారమనే విషయాన్ని గ్రహించారనీ వ్యాఖ్యానించారు. 'సెట్టింగ్, పాత్రలు, స్టోరీ లైన్, మలుపులు, థీమ్, మెసేజ్...వంటివన్నీ ఇంచుమించు నేను రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ నుంచి తీసుకున్నవే. అవసరమైన చోట్ల మాత్రమే కొద్ది మార్పులు చేశారు. 70 శాతం స్క్రిప్టు నవలలోనిదేనంటూ పలువురు ప్రముఖ సినీ విమర్శకులు నాకు చెప్పారు. నా మాటల మీద నమ్మకం లేకపోతే నవల చదివి ఆ తర్వాత సినిమా చూడండి' అని చోప్రా స్పష్టం చేశారు.
అమీర్ వాదన ఇంకోలా ఉంది. గురువారంనాడు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, చేతన్ ప్రవర్తన దురదృష్టకరమని అన్నారు. భగత్ తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కు జోషి, హిరానీ కట్టుబడి ఉన్నారనీ, క్రాంట్రాక్ ప్రకారమే చేతన్ కు తగినవిధంగా క్రెడిట్ ఇవ్వడం జరిగిందనీ అమీర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 2 January, 2010
|