షేర్లు అమ్మేసిన రిల్
పెట్రోకెమికల్స్ సంస్థ లైయన్ డెల్ బాసెల్ ను కొనుగోలు చేయాలన్న తన ప్రతిపాదనను ఆచరణ రూపం ఇవ్వడం కోసం సంస్థ అత్యవసర నిధిని సిద్ధం చేస్తున్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు తెలియజేశారు. అప్పు చేయకుండా తన అంతర్గత నిధులతో ఆ దివాలా సంస్థను కొనుగోలు చేయాలని తాను యోచిస్తున్నట్లు ఆర్ఐఎల్ గతంలో తెలియజేసింది. ఆర్ఐఎల్ వద్ద ప్రస్తుతం రూ. 4000 కోట్లకు పైగా నగదు ఉన్నది. సంస్థ ట్రెజరీ స్టాక్స్ విలువ రూ. 16,485 కోట్లు. సోమవారం అమ్మకం అనంతరం ట్రస్ట్ షేర్ల నిల్వలు 17.92 కోట్ల నుంచి 15.34 కోట్లకు తగ్గిపోయాయి.
లైయన్ డెల్ బాసెల్ లావాదేవీ విలువ 10 బిలియన్ డాలర్లు, 12 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని తెలుస్తున్నది. కోలకతాకు చెందిన వ్యాపారి జనార్దన్ కొఠారి తనను సంప్రదించిన టిఒఐ విలేఖరితో మాట్లాడుతూ, రిలయన్స ఇండస్ట్రీస్ సంస్థ తన ట్రెజరీ షేర్ల అమ్మకాన్ని కొనసాగించగలదని సూచించారు. ఈ షేర్ల లావాదేవీలు రూ. 1000, రూ. 1200 మధ్య సాగవచ్చునని ఆయన భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 5 January, 2010
|