చేదెక్కిన చక్కెర
క్రితం సంవత్సరం చివరి వరకు చక్కెర ఎగుమతులను అనుమతించినందున, చెరకు పంట విస్తీర్ణం, ఉత్పాదకత తగ్గుదల వల్ల ఖరీఫ్ పంట బాగా దెబ్బ తిన్నందున ఈ పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరకు సంబంధించి ఎగుమతి ప్రక్రియ వాయిదా వంటి కొన్ని చర్యలను ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ద్రవ్యోల్బణ సూచనలు, అక్రమ నిల్వలు ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. చక్కెరను భారీగా వినియోగించే సాఫ్ట్ డ్రింక్ లు, కన్ఫెక్షనరీ కంపెనీలు వంటి వినియోగదారుల వద్ద సరకుల నిల్వలపై పరిమితులను కూడా ప్రభుత్వం విధించింది.
పిడిఎస్ డిపోలకు అదనంగా చక్కెర, గోధుమలు, బియ్యం విక్రయం కోసం జిల్లాలలో ప్రత్యేకంగా రీటైల్ కౌంటర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని కొందరు నిపుణులు సూచించారు. చక్కెర ఉత్పత్తి నిజంగానే తగ్గినప్పటికీ, గోధుమల నిల్వలు తగినంతగా ఉన్నాయి. అయినప్పటికీ గోధుమల ధరలు పెరుగుతున్నాయి. తన వద్ద ఉన్న గోధుమలు, బియ్యం నిల్వలను వేలంపాటల ద్వారా తగ్గించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది కాని స్పందన నామమాత్రంగానే ఉన్నది. అందువల్ల సరాసరి అమ్మకాలు జరపడమే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
డిమాండ్ - సప్లయి మధ్య అధికమైన తేడాకు తోడు కొత్త సంవత్సరం, పెళ్లిళ్ల సీజన్ కోసం హెచ్చిన కొనుగోళ్ళతో టోకు మార్కెట్ లో చక్కెర ధరలు క్వింటాల్ కు రూ. 4150కి పెరిగాయి. చక్కెర డిమాండ్ ఇంకా పెరగవచ్చు. మరొక పక్క ఢిల్లీ టోకు మార్కెట్ లో వర్తకులు ఈ ధరలు పెరగక తప్పదని అంటున్నారు. డిసెంబర్ 19న క్వింటాల్ ధర రూ. 3590, రూ. 3700 మధ్య ఉండగా ఇప్పుడు రూ. 4150, రూ. 4250 మధ్య ఉన్నదని వారు చెబుతున్నారు.
చక్కెర మధ్య,తక్కువ స్థాయి ధరలు రూ. 100 మేర పెరిగాయి. మధ్య స్థాయి చక్కెర ధర క్వింటాల్ రూ. 4150, రూ. 4250 శ్రేణిలోను, తక్కువ స్థాయి చక్కెర ధర క్వింటాల్ రూ. 4140, రూ. 4240 శ్రేణిలోను ఉన్నాయి. ఇక దేశీయ చెరకు నుంచి చక్కెర ఉత్పత్తి 16 మిలియన్ టన్నులుగా ఉండవచ్చునని సూచిస్తున్నారు. వార్షిక డిమాండ్ 23 మిలియన్ టన్నుల మేర ఉంది. మిల్లుల నుంచి పంపే మీడియం గ్రేడ్, సెకండ్ గ్రేడ్ చక్కెర ధరలు కూడా రూ. 50 మేరకు పెరిగాయి. మీడియం గ్రేడ్ చక్కెర ధర క్వింటాల్ రూ. 4100, రూ. 4200 శ్రేణిలోను, సెకండ్ గ్రేడ్ చక్కెర ధర క్వింటాల్ రూ. 4090, రూ. 4190 శ్రేణిలోను ఉన్నాయి.
Pages: -1- 2 News Posted: 7 January, 2010
|