దక్షిణాధి భాషల్లో '3 ఇడియట్స్'
ప్రివ్యూ చూసిన రామ్ చరణ్
నిర్మాత విధు వినోద్ చోప్రా '3 ఇడియట్స్' రిలీజ్ కు ముందు 'మగధీర' హీరో రామ్ చరణ్ ను ప్రివ్యూకు ఆహ్వానించారు. రామ్ చరణ్ కు ఈ సినిమా ఎంతగానో నచ్చడంతో తన తండ్రి చిరంజీవి, అంకుల్ పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ను ఏర్పాటు చేశారు. '3 ఇడియట్స్' తెలుగు, తమిళ రీమేక్ విషయంలో నిర్మాత ధనంజయన్ అభిప్రాయం ఒకింత భిన్నంగా ఉంది. సరళమైన ఇతివృత్తాలతో కూడిన సినిమాలు ఈ రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ కావడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రీమేక్ రైట్స్ కోసం కోట్లాది రూపాయలు పోయడం సరికాదనీ, అదే బడ్జెట్ తో మనం రెండు సినిమాలు తీయవచ్చనీ ఓ ప్రముఖ తెలుగునిర్మాత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ ఆలోచన మరోలా ఉందనుకోవచ్చు. తెలుగు వెర్షన్ లో అమీర్ పాత్రను పవన్ కల్యాణ్ చేత చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. మహేష్ బాబు పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నప్పటికీ జెమినీ ఫిలిం సర్క్యూట్ గతంలో తీసిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిరంజీవి నటించడంతో, ఈసారి పవన్ కల్యాణ్ కే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయనీ ఇండస్ట్రీ వర్గాలు నమ్మబలుకుతున్నాయి.
Pages: -1- 2 News Posted: 9 January, 2010
|