ఊరూరా 'టాటా' హోటళ్లు
ఆర్ సిఎల్ క్రితం పుణెలో రెండవ జింజర్ హోటల్ ను ప్రారంభించింది. ఆ నగరంలో మరి రెండింటికి స్థలాల కోసం సంస్థ అన్వేషిస్తున్నది. 'ముంబై, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సిఆర్)తో కలిపి ఢిల్లీ మాకు పెద్ద మార్కెట్లు కాగలవు. మా సూరత్, ఇండోర్ హోటళ్ల నిర్మాణం కూడా పురోగతిలో ఉన్నది. మహారాష్ట్రలో నాందేడ్, నాగపూర్ నగరాలలో హోటళ్ళు, పుణెలో మరి రెండు హోటళ్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నాం' అని పాణి తెలియజేశారు.
అగర్తలా, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, దుర్గాపూర్, దుర్గ్, గోవా, పుణె, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి, హరిద్వార్, జంషెడ్పూర్, లూధియానా, మైసూరు, నాసిక్, న్యూఢిల్లీ, పంత్ నగర్, పుదుచ్చేరి, వడోదరలలో 20 జింజర్ హోటళ్లు ఉన్నాయి. జింజర్ హోటళ్లలో ఆధునిక సౌకర్యాలు, టీ, కాఫీ మేకర్, వైఫై కనెక్టివిటీ, గోడలో అమర్చిన 20 అంగుళాల ఎల్ సిడి టివి, స్వయం నియంత్రిత ఎసి, మినీ ఫ్రిజ్ వంటి సదుపాయాలు రూ. 1000 నుంచి రూ. 1700 వరకు రేట్లలో లభిస్తాయి.
రూట్స్ కార్పొరేషన్ మొదట్లో కొన్ని హోటళ్లను స్థలం కొనుగోలు చేసి నిర్మించింది. ఇప్పటికే ఉన్న హోటళ్లను మెరుగుపరిచడం, గెస్ట్ హౌస్ లను మార్చడం, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల (పిపిపి) ద్వారా తమ కార్యకలాపాల విస్తరణకు సంస్థ సుముఖంగా ఉందని పాణి తెలిపారు. న్యూఢిల్లీలోని తమ హోటల్ ను ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే సంస్థ ఐఆర్ సిటిసి భాగస్వామ్యంతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. 'మేము స్థలం కొనగలిగితే కొని హోటల్ ఏర్పాటు చేస్తాం. మేము లీజుకు తీసుకోవచ్చు లేదా మేనేజ్ మెంట్ కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు. మార్కెట్ లో స్థానం సంపాదించడమే మాకు ముఖ్యం. పరిశ్రమ కన్నా ఎక్కువ వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం' అని ఆయన వివరించారు. మూడు మాసాల కాలంలో 20 హోటళ్లలో ఆక్యుపెన్సీ 65 శాతం, 75 శాతం మధ్య ఉందని, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో పూర్తిగా రిజర్వ్ అయ్యాయని పాణి తెలిపారు.
Pages: -1- 2 News Posted: 11 January, 2010
|