'బాష్'కు చైనా నకిలీలు
'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక విలేఖరులు ఆ స్టాల్ ను సందర్శించి, ఆ నిషిద్ధ వస్తువులను పరిశీలించారు. ఎగ్జిబిటర్ సోమవారం ఉదయం ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేశారు. ఆ వస్తువులపై 'బాష్' అనే పేరు ఉంది. ఆ అత్యాధునిక ఉత్పత్తి స్థాయి చెప్పుకోదగినదని, ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ బాష్ ఇతర ఆటోమోటివ్ లైటింగ్ సిస్టమ్ ల ప్యాకింగ్ ను పోలి ఉందని దేశీయ ఉత్పత్తిదారులు పేర్కొన్నారు.
ఆటో ఎక్స్ పోలో నకిలీ ఉత్పత్తుల గురించి తమకు తెలియదని పెవిలియన్ లోని చైనీస్ డెలిగేట్లు చెప్పారు. చైనీస్ ఒఇఎం (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యుఫ్యాక్చరర్)లకు సప్లయిలు చేసే పిస్టన రింగ్ ల ఉత్పత్తి సంస్థ ప్రతినిధి ఆటో ఎక్స్ పోలో ఇతర నకిలీ ఉత్పత్తులు కూడా చోటు చేసుకుని ఉండవచ్చునని అన్నారు. అంతకుమించి ఆయనేమీ చెప్పలేదు.
బాష్ ఉత్పత్తుల జాబితాలో ఎక్కువగా నకిలీ తయారీకి గురయ్యేది స్పార్క్ ప్లగ్ అని సదానందం చెప్పారు. 'వీటిని దేశీయ నకిలీ ఉత్పత్తిదారులు తయారు చేయరు. వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. ఒరిజినల్ బాష్ ఉత్పత్తులుగా ప్రదర్శించే ఇతర నకిలీ ఉత్పత్తులలో రీకండీషన్డ్ డెలివరీ వాల్వ్ లు, నాజిల్స్, డీజెల్ ఫిల్టర్ ఇన్సర్ట్ లు ఉన్నాయి. వీటిని స్థానికంగా తయారు చేస్తుంటారు' అని ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 12 January, 2010
|