విద్యారంగ విప్లవం 'స్టెల్లార్'
ఈ- టీచింగ్ :
స్టెల్లార్ రూపొందించిన బోధనా టూల్స్ పాఠ్యాంశాన్ని విడమర్చి చెప్పడంలో టీచర్లకు సాథికారతను ప్రసాదిస్తాయన్నారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందేలా గ్రాఫిక్స్, యానిమేషన్, 3డి చిత్రాలను తరగతి గదిలో స్టెల్లార్ టీచర్ ఉపయోగిస్తారన్నారు. ఇంటరాక్టీవ్ బోర్డులు, ఎలక్ట్రానిక్ నోట్సులు ప్రస్తుత సాధారణ తరగతి గదులను ఈ - క్లాస్ రూమ్ లుగా మార్చివేస్తాయని వివరించారు. స్పష్టమైన బోధనా విధానం వలన విద్యార్ధి ఎలాంటి ప్రశ్నకైనా సులువుగా సమాధానం ఇవ్వడమే కాకుండా వాస్తవ ప్రపంచానికి వాటిని అన్వయించి, వాటి ఫలితాలను అస్వాదించగలుగుతాడని ప్రసాద్ కూనిశెట్టి తెలిపారు.
వర్చువల్ క్లాస్ రూమ్ :
స్టెల్లార్ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్ లు ఉంటాయన్నారు. మారుమూల పాఠశాలలో కూడా నిపుణులైన టీచర్ల బోధన అందుబాటులోకి స్టెల్లార్ తెస్తుందన్నారు. వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టీచరయినా స్టెల్లార్ పాఠశాల విద్యార్థికి పాఠాలను బోధించే సౌలభ్యం ఉంటుందన్నారు. ఈ విధానం ద్వారా విద్యార్ధులు ఉత్తమంలో అత్యుత్తమమైన టీచర్ల బోధనను పొందగలుగుతారని, అలానే అవసరమైన విద్యార్థికి టీచర్ అందుబాటులో ఉంటారని వివరించారు.
పరిపూర్ణ పరిష్కారం :
ఎంత అధునాతనమైన బోధనా పద్ధతులైనా అసమర్థ యాజమాన్యం వలన కొరగాకుండా పోతాయని ప్రసాద్ అన్నారు. అందుకే స్టెల్లార్ యాజమాన్యంలోనూ చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు. పాఠశాలలో చోటుచేసుకునే ప్రతీ పరిణామాన్నీ అర్థం చేసుకునేలా యాజమాన్యంలో అవగాహన పెంచుతామన్నారు. ప్రతీ విద్యార్థీ వ్యక్తిగత ప్రగతిని యాజమాన్యం ప్రత్యక్షంగా మదింపు వేస్తుందన్నారు. ఆన్ లైన్ పరీక్షలు, టీచర్లతో ముఖాముఖీ, విద్యార్థుల ప్రగతి సమీక్షలు, టీచర్ల నైపుణ్యాల సమీక్షలు, ఆర్థిక నిర్వహణ, హాజరు, స్కూలు బస్సుల ట్రాకింగ్, హాస్టలు యాజమాన్యం, టీచర్లకు తల్లితండ్రుల మధ్య పరస్పర చర్చలు, పిల్లల పురోగతిని ఎప్పటికప్పడు తల్లితండ్రులకు వివరించడం వంటి నిర్వహణ పద్ధతులన్నీ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల ద్వారా అమలు చేస్తామని తెలిపారు. అసలు తమ పిల్లలు ఏం చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో, వారికి దేని మీద అసక్తి, అభిరుచి ఉన్నాయన్న అంశాలపై తల్లితండ్రుల్లో అహగాహన కల్పించడానికీ స్టెల్లార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 22 January, 2010
|