విద్యారంగ విప్లవం 'స్టెల్లార్'
రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో స్టెల్లార్ విద్యా పద్ధతులను ప్రవేశపెడతామని చెప్పారు. స్టెల్లార్ బ్రాండ్ పొందిన పాఠశాలల యాజమాన్యాలకు పైసా ఖర్చు లేకుండా ఈ విధానాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతీ పాఠశాలపై రిజల్టికా సంస్థ దాదాపు 30 లక్షల రూపాయలను వినియోగించనున్నదని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో ఉన్న పాఠశాలైనా స్టెల్లార్ బ్రాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, కానీ విద్యార్ధుల సంఖ్య ఐదు వందలకు మించి ఉండాలని ప్రసాద్ కూనిశెట్టి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల కంటే స్టెల్లార్ విధానం అమలయ్యే పాఠశాలలు విశిష్టంగా ఉండబోతాయని ఆయన అన్నారు. ఇలాంటి విధానం ఎవరూ అమలు చేయడం లేదన్నారు.
స్టెల్లార్ కు ఆర్ధికంగా ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు కూడా సహకారం అందిస్తున్నారని చెప్పారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ విశ్వవిద్యాలయం, పేస్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చెందిన విద్యావేత్తలు స్టెల్లార్ కు డైరెక్టర్లుగా, సలహాదారులుగా ఉన్నారని చెప్పారు. స్టెల్లార్ కార్యనిర్వాహక బృందంలో విద్యారంగం, సమాచార విభాగం, టెక్నాలజీ, సామాజిక శాస్త్ర రంగాల ప్రముఖులు ఉన్నారని తెలిపారు. అలానే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఐటి నిపుణులు, వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేసే వ్యక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 22 January, 2010
|