విద్యారంగ విప్లవం 'స్టెల్లార్'
హైదరాబాద్ : మన దేశంలోని పాఠశాల విద్యావిధానంలో గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' ను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని రిజల్టికా ఎడ్యుకేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ కూనిశెట్టి ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి విద్యావేత్తలు, సాఫ్ట్ వేర్ నిపుణులు నిరంతర పరిశోధనలతో ఈ విధానాన్ని ఆవిష్కరించారని, విద్యాబోధనలో, పాఠశాలల నిర్వాహణలో 'స్టెల్లార్' విధానం విప్లవాత్మకమైన ఫలితాలను ఆవిష్కరించి తీరుతుందని ఆయన చెప్పారు.
నూతన బోధనాపద్ధతులు, ఈ-లెర్నింగ్, శిక్షణ, పరిపాలన, నిర్వహణ తదితర పాఠశాల నిర్వహణ వ్యవస్థల్లో సాఫ్ట్ వేర్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' ను ప్రసాద్ కూనిశెట్టి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో విడుదల చేశారు. న్యూజెర్సీలో ఉంటున్న ప్రసాద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. తమ రిజల్టికా సంస్థ గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర విద్యారంగంలో సేవలు అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలు రిజల్టికా సొల్యూషన్స్ ని వినియోగించుకుని మంచి ఫలితాలను రాబట్టుకుంటున్నాయని ఆయన చెప్పారు. యాజమాన్య పద్ధతులు, రికార్డులు, ఈ-లెర్నింగ్, ఈ-టెస్టింగ్, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలలో రిజల్టికా సేవలను అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి, కాకతీయ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు, ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, ఇలా ఎన్నెన్నో విద్యాసంస్థలు రిజల్టికా సంస్థకు ఖాతాదారులుగా ఉన్నాయని వివరించారు. రిజల్టికా సంస్థను పలువురు ప్రవాస భారతీయులు ప్రమోట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత విద్యారంగాన్ని సునిశితంగా పరిశీలించిన రిజల్టికా అనేక విభిన్నాంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' కు రూపకల్పన చేసిందని ప్రసాద్ చెప్పారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 22 January, 2010
|