విద్యారంగ విప్లవం 'స్టెల్లార్'
ప్రస్తుతం విద్యారంగంలో ఉన్న లోపాలకు 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' చక్కగా పరిష్కార మార్గాలను చూపించగలదని ప్రసాద్ కూనిశెట్టి అన్నారు. అన్ని రంగాలూ శరవేగంగా మారిపోతున్న ఆధునిక యుగంలో విద్యారంగం అనేక అంశాలలో పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. దాని ఫలితంగా విద్యార్ధుల్లో సృజనాత్మక శక్తి సన్నగిల్లుతోందని, కొత్త ఆవిష్కరణలకు అవరోధం కలుగుతోందని చెప్పారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల మధ్య సరైన అవగాహనే కొరవడిందని, ఈ సమన్వయ లేమి వలన విద్యార్ధుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన చెప్పారు. పాఠాలను భట్టీయం పట్టి, మార్కుల కోసం పరీక్షలు రాసి, సాదాసీదా డిగ్రీలు సంపాదించుకుంటే చాలనుకునే రోజులు పోయాయని ఆయన అన్నారు.
శరవేగంతో దూసుకుపోతున్న పాశ్చాత్యదేశాల్లోని విద్యావ్యవస్థను తులనాత్మకంగా అధ్యయనం చేసి, వాటిలోని ఉత్తమ పద్ధతులను భారతదేశ విద్యారంగం పరిస్థితులకు అనుగుణంగా మలిచి రూపొందించిందే 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' అని ఆయన వివరించారు. విద్యార్థిని అసమాన విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దటం, పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో రాణించగలిగే మేథను పెంపొందించడం 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' లక్ష్యాలుగా ప్రసాద్ కూనిశెట్టి వివరించారు. విద్యార్థి ఆలోచించేలా చేయడం, అర్ధం చేసుకునే సామర్ధ్యాన్ని పెంపొందించడం, సహేతుకమైన భావనతో ముందుకు సాగేలా చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన చెప్పారు. తాము చదువుకున్న చదువును, దాని ద్వారా పొందిన జ్ఞానం, దాని ప్రయోజనాలను దైనందిన జీవితంలో వినియోగించుకునేలా 'స్టెల్లార్ ఎడ్యుకేషన్ సిస్టమ్' దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.
అత్యున్నతమైన మెథడాలజీలో స్టెల్లార్ నాలుగు విధాలైన సొల్యూషన్స్ ను అందిస్తోందని ప్రసాద్ కూనిశెట్టి వివరించారు. ఒక విశిష్టమైన, సమగ్ర బోధనా ప్రణాళిక దానిలో మొదటిదని ఆయన చెప్పారు. ఇది ఆధునిక బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు అందిస్తుందన్నారు. ఈ విధానం వలన విద్యార్ధి చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా, ఆనందకరంగా భావిస్తాడన్నారు. ఎసైన్ మెంట్, ప్రాక్టీసు పుస్తకాలు తరగతిగదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశాలను అలవోకగా మననంలోకి తెచ్చేవిగా ఉంటాయన్నారు. ఇవన్నీ విదేశాల్లో అమలు చేస్తున్న ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించి రూపొందించినవని, వీటిని భారతీయ విద్యారంగానికి అన్వయించడానికి భారత విద్యావేత్తలతో పరిశోధనలు చేయించామని వెల్లడించారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 22 January, 2010
|