రజాక్ కు ఆఫర్ తెలీదు: మోడి ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ ను ఒక ఐపిఎల్ ఫ్రాంచైజీ ఈ ఏడాది లీగ్ లో ఆడేందుకై సంప్రదించినట్లు ఇజాజ్ బట్ చెప్పాడు. ఆ జట్టు డక్కన్ చార్జర్స్ అని చెప్పిన బట్ ఈ విషయం లిఖితపూర్వకంగా వారి వద్ద నుంచి ఆఫర్ ను పొందవలసిందిగా రజాక్ ను కోరానని తెలిపారు. కాగా, బట్ ప్రకటన సంచలనం కలిగించింది. ఎందుకంటే, ఈ నెల 19న ముంబైలో నిర్వహించిన వేలం కార్యక్రమంలో పాకిస్తాన్ కు చెందిన మొత్తం 11 మంది క్రీడాకారులను నిర్లక్ష్యం చేయడం రెండు దేశాల మధ్య వివాదానికి దారి తీసింది.
అయితే, ఈ వివాదంతో విసుగెత్తిపోయిన మోడి ఇంకా మాట్లాడుతూ, ఏమైనా గాయపడిన క్రీడాకారుని స్థానంలో మరొకరిని చేర్చుకోవడానికి 'రెండు మూడు వారాల వ్యవధి' పడుతుందని చెప్పారు. 'ముందుగా నేను గాయాన్ని నిర్థారించుకోవలసి ఉంటుంది. తరువాత ఆ విషయం ధ్రువీకరణకు నేను ఎవరినైనా పంపుతాను. (సదరు క్రీడాకారుని) దేశం బోర్డు దానిని నిర్థారించవలసి ఉంటుంది. అయితే, ఆ క్రీడాకారుడు సీజన్ లో కనీసం ఒక్క రోజైనా అందుబాటులో ఉంటే అతని స్థానంలో మరొకరిని చేర్చుకోజాలరు' అని ఆయన స్పష్టం చేశారు.
క్షతగాత్రుని బదులు మరొకరికి స్థానం కల్పించే ప్రక్రియను ఐపిఎల్ తొలి మ్యాచ్ కు మూడు రోజుల ముందు వరకు అంటే మార్చి 8 వరకు జరపవచ్చు. అయితే, రజాక్ కు ఐపిఎల్ ఆఫర్లు వచ్చినట్లు ఇజాజ్ బట్ వాదిస్తూనే ఉన్నారు. ఇది సాధ్యం కాదని మోడి స్పష్టీకరించారని బుధవారం చెప్పినప్పుడు 'అంటే నేను అబద్ధమాడుతున్నానని అనుకుంటున్నారా' అని బట్ ప్రశ్నించారు.
Pages: -1- 2 -3- News Posted: 29 January, 2010
|