రజాక్ కు ఆఫర్ తెలీదు: మోడి రజాక్ కు కోలకతా నైట్ రైడర్స్ నుంచి ఆఫర్ వచ్చిందని బట్ గురువారం కూడా నొక్కి చెప్పారు. 'రజాక్ ఈ ఉదయం నాకు ఫోన్ చేసి (కెకెఆర్ సారథి) సౌరవ్ గంగూలీ తన కోసం ఒక సంవత్సరం కాంట్రాక్టును సిద్ధం చేసినట్లు ఫోన్ లో చెప్పినట్లు తెలియజేశాడు. కాని ఫ్రాంచైజీలలో ఎవరైనా అధికారికంగా లిఖితపూర్వకంగా ఆఫర్ ను పంపిన తరువాత (అతను పాల్గొనడానికి అనుమతిస్తూ) నేను మాత్రమే నిర్ణయం తీసుకోగలను' అని బట్ వివరించారు.
'ఏ క్రీడాకారునినైనా మారుస్తున్నట్లయితే లేదా అతనికి ఆఫర్ ఇస్తున్నట్లయితే నాకే ముందు తెలుస్తుంది. మరెవరికీ తెలియదు. నేను అనుమతి ఇవ్వవలసి ఉంటుంది' అని మోడి చెప్పారు.
మరి వేలంపాటకు ముందు ఒక సంవత్సరం పాటు రజాక్ తో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒక ఫ్రాంచైజీ వెల్లడించడం గురించిన ప్రశ్నకు మోడి సమాధానం ఇస్తూ, 'నిజమే. వేలంపాటకు ముందు రజాక్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒక ఫ్రాంచైజీ ప్రయత్నించింది. కాని అది సాధ్యం కాదని నేను చెప్పాను. దానితో అతనికి వేలంపాటలో స్థానం కల్పించవలసిందిగా వారు నన్ను కోరారు. నేను ఆ పని చేశాను. ఆతరువాత ఆ ఫ్రాంచైజీ ఒక ఫాస్ట్ బౌలర్ ను కోరుకుని షేన్ బాండ్ పై తన మొత్తం డబ్బును వెచ్చించింది' అని తెలియజేశారు.
బాండ్ ను కోలకతా నైట్ రైడర్స్ 7.50 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. రజాక్ కోసం కెకెఆర్ బిడ్ చేయలేదు. ఈ పరిస్థితులలో ఐపిఎల్ మూడవ సీజన్ టోర్నీలో పాకిస్తానీ క్రీడాకారులు ఎవరికి అవకాశం లేకపోతోంది.
Pages: -1- -2- 3 News Posted: 29 January, 2010
|