వడ్డీ రేట్లు పెరగవచ్చు
ఆర్ బిఐ సిఆర్ఆర్ ను హెచ్చించడంపై స్టాక్ మార్కెట్లలో తొలుత ప్రతికూల స్పందన కానవచ్చింది. కాని ఆ తరువాత అవి ఆ నష్టాలను భర్తీ చేసుకున్నాయి. సిఆర్ఆర్ హెచ్చింపుపై ప్రకటన వెలువడినప్పుడు సెన్సెక్స్ సుమారు 100 పాయింట్ల మేరతకు పతనమైంది. కాని సమీప భవిష్యత్తులో వృద్ధి కోసం ద్రవ్య సరఫరాకు వడ్డీ రేట్లపై దీని ప్రభావం పడదని మార్కెట్ గ్రహించిన వెంటనే సెన్సెక్స్ నష్టాలను పూడ్చుకున్నది.
2009 - 10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడవ త్రైమాసిక ద్రవ్య, పరపతి విధానం ప్రకటించిన అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ డి. సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, పరపతి విధానం గురించి చర్చించేందుకై తాను శుక్రవారం ఉదయం కలుసుకున్న బ్యాంకర్లు ఈ సిఆర్ఆర్ హెచ్చింపు వల్ల రుణ రేట్లపై వెంటనే ఒత్తిడి పడదని చెప్పినట్లు తెలియజేశారు.
ఆర్ బిఐ తన అక్టోబర్ విధానంలో ప్రకటించిన ఆరు శాతం జిడిపి వృద్ధి రేటు అంచనాను ఇప్పుడు 7.5 శాతానికి హెచ్చించింది. రియల్టీ రంగం పుంజుకోవడం ఇందుకు ఒక కారణం. వ్యవసాయ రంగంలో వృద్ధి దాదాపు శూన్యంగా ఉన్నప్పటికీ పారిశ్రామికోత్పత్తి, సేవల రంగంలో వృద్ధి ఇందుకు దోహదం చేయగలదని డాక్టర్ సుబ్బారావు సూచించారు.
Pages: -1- 2 News Posted: 30 January, 2010
|