'టెన్నిస్' గుండెకోతలు

జిమ్మీ కానర్స్, క్రిస్ ఎవర్ట్ 1974లో తాము గెలుచుకున్న వింబుల్డన్ ట్రోఫీలతో కలసి ఫోటోలు దిగి టెన్నిస్ ప్రపంచాన్ని ఉత్సుకతకు లోను చేశారు. నిశ్చితార్థం చేసుకున్న తరువాత వారు 1974 నవంబర్ 8న వివాహం చేసుకోవాలని సంకల్పించారు. కాని ఆతరువాత ఆ ముచ్చట మున్నాళ్ళకే ముక్కలైంది.
ఇక మార్టినా నవ్రతిలోవా సెక్సువల్ ఇష్టాయిష్టాలను ఏమాత్రం దాచుకోలేదు. లెస్బియన్ అయిన మార్టీనా జూడీ నెల్సన్ అనే అందాల భామతో సుదీర్ఘ కాలం సంబంధాలు కొనసాగించింది. వారి మధ్య బంధం 1991లో తెగిపోయింది. మార్టినాతో కలసి జీవించడానికి టెక్సాస్ అందాల రాణి అయిన జూడీ నెల్సన్ తన భర్తను, ఇద్దరు పిల్లలను వదలిపెట్టింది.
తమ మధ్య సంబంధాల గురించి వార్త రాసిన ఒక దినపత్రికపై దావా వేసిన పది నెలల తరువాత ఆండ్రీ అగస్సీ, బ్రూక్ షీల్డ్స్ 1998 ఏప్రిల్ 19న వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తరువాత ఆ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతే వారి బంధం తెగిపోయింది. తలపై జుత్తును పూర్తిగా తొలగించుకోవలసిందిగా అగస్సీకి షీల్డ్స్ నచ్చజెప్పినట్లు సమాచారం వచ్చింది.
Pages: -1- 2 -3- News Posted: 1 February, 2010
|