'టెన్నిస్' గుండెకోతలు

ఆస్సీస్ టెన్నిస్ ప్రముఖుడు లీటన్ హెవిట్, బెల్జియన్ క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్ మధ్య అనురాగ బంధానికి 2003 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నాంది పడింది. 2003 క్రిస్మస్ కు సరిగ్గా ముందు తమ నిశ్చితార్థం గురించి వారిద్దరు ప్రకటించారు. కాని వారిద్దరు 2004 అక్టోబర్ లో విడిపోయారు. దానితో 2005 ఫిబ్రవరిలో జరగవలసిన వారి వివాహం రద్దయింది.
2002 నవంబర్ లో పియరీ యెవిస్ ను జస్టిన్ హెనిన్ పెళ్ళి చేసుకుంది. ఐదు సంవత్సరాల తరువాత ఆమెకు వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
పియరీ యెవెస్ నుంచి తాను విడిపోయినట్లు హెనిన్ ఆతరువాత ధ్రువీకరించింది. హెనిన్ ఇటీవలే అంతర్జాతీయ టెన్నిస్ లోకి తిరిగి ప్రవేశించింది.
మేటి భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ బాలీవుడ్ నటి మహిమా చౌదరితో కొంతకాలం ప్రేమాయణం సాగించాడు. కాని వారి ప్రేమ బంధం త్వరగానే తెగిపోయింది. ఇప్పుడు మహిమ వివాహిత, తల్లి కూడా.ఇక లియాండర్ కు మోడల్, నటి రియా పిళ్ళై ద్వారా ఒక కుమార్తె పుట్టింది.
Pages: -1- -2- 3 News Posted: 1 February, 2010
|