'మై నేమ్ ఈజ్ ఖాన్' ఖాళీ?
అమీర్ '3 ఇడియట్స్' చిత్రం మొదటి మూడు రోజుల్లో 90 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దీనికి పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా వచ్చిన 9 కోట్లు మినహాయింపు. ఇండియన్ బాక్సాఫీస్ ఓపినింగ్స్ పరంగా '3 ఇడియట్స్' మొదటి వారాంతంలో 70 కోట్లు రాబట్టుకోగా, 'మై నేమ్ ఈజ్ ఖాన్' కేవలం 47 కోట్లు రాబట్టగలిగింది. అయితే 'మై నేమ్ ఈజ్ ఖాన్' ఓవర్సీస్ పరంగా '3 ఇడియట్స్' కంటే మంచి ఫలితాన్ని రాబట్టింది. ఓపినింగ్ వీకెండ్ లో షారూక్ సినిమాకి 43 కోట్ల గ్రాస్ లభిస్తే, అమీర్ సినిమాకి 20 కోట్లు వచ్చింది. దీనిపై సినీ ట్రేడ్ విశ్లేషకుడు కోమల్ నహతా మాట్లాడుతూ, 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ఓవర్సీస్ లో బాగా ఆడుతోందనీ, అయితే బాలీవుడ్ లో ఇంతవరకూ వచ్చిన సినిమాల్లో అత్యధిక గ్రాసర్ గా చెప్పడానికి మాత్రం వీల్లేదనీ అన్నారు. వారం రోజుల థియేటర్ ఆక్యుపెన్సీ దాదాపు 60 శాతానికి పడిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 18 February, 2010
|