పాత రోత కాదు 'పసిడి' కోలకతా : మరీ కుదించిన ఓవర్ల గేముతో టెస్ట్ క్రికెట్ పాపులారిటీకి సవాల్ ఎదురవుతున్న దేశంలో కోలకతా ఈడెన్ గార్డెన్స్ లో అధిక సంఖ్యాక వీక్షకుల సమక్షంలో టీమ్ ఇండియా విజయం ఘనమైనదే. క్రికెట్ సాంప్రదాయక గేము పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నది కార్పొరేట్ ప్రపంచం, స్పాన్సర్లు మాత్రమే కాకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కూడా. బిసిసిఐ దృష్టి అంతకంతకు ఐపిఎల్ మీదే ఉంటున్నది. టెస్టులకు ఇతోధికంగా విలువ ఇస్తుండే క్రీడాకారులు సీరీస్ ను సమం చేసుకోవడం, ప్రపంచ ర్యాంకింగ్ లలో రెండవ స్థానానికి పతనం కాకుండా తప్పించుకోవడం అందుకే ముఖ్యం.
చివరి రోజు కూడా టెస్ట్ క్రికెట్ ఉత్కంఠభరితంగా సాగింది. గంటల తరబడి పరుగులు చేయకపోయినప్పటికీ మ్యాచ్ ఎలా ముగుస్తుందోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. బౌండరీలు, సిక్సర్లు లేకపోయినప్పటికీ, చివరకు సింగిల్స్ కూడా స్కోరు చేస్తుండకపోతున్నప్పటికీ సమస్త భారత క్రీడాభిమానులు, ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికా ప్రజలు కూడా తమ టివి సెట్లకు అతుక్కుపోయే ఉండి ఉంటారు. బ్యాట్స్ మన్ ల ప్రతి రక్షణాత్మక స్ట్రోక్ తో ఉత్కంఠ భరించలేనంతగా మారింది. చివరకు కరడుగట్టిన భారత అభిమాని కూడా సాధువు తరహా దృఢచిత్తంతో ఆడిన హషిమ్ ఆమ్లాకు సాల్యూట్ చేసి ఉండాలి. ఈ టెస్ట్ గెలిచి, ప్రపంచ చాంపియన్లుగా కొనసాగడం మహేంద్ర సింగ్ ధోనిని, అతని సహచరులను ఆమ్లా నానా ఇబ్బందులకు గురి చేశాడు.
ఈ సీజన్ లో ఇండియా అంతగా టెస్ట్ క్రికెట్ ఆడకపోతుండడంతో అగ్ర స్థానం నుంచి పతనం కావలసి ఉంటుంది కనుక క్రీడాకారుల నుంచి ఒత్తిడి వచ్చిన మీదట ఆదరబాదరాగా ఏర్పాటు చేసిన ఈ సీరీస్ అశుభసూచకంగా ప్రారంభమైంది. నాగపూర్ లో దారుణంగా ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పొందడం జట్టు స్థైర్యాన్ని దెబ్బ తీసింది. ఈడెన్ మైదానంలో మొదటి రోజు టీ విరామ సమయానికల్లా ఈ టెస్టు కూడా జట్టు చేజారుతుందేమోననిపించింది. కాని దక్షిణాఫ్రికా పరంగా చూస్తే మొదటి రెండు సెషన్లలో భారత బౌలింగ్ ను చీల్చిచెండాడిన తరువాత వారి బ్యాట్స్ మన్ లు అనూహ్యంగా కుప్పకూలిపోయి మ్యాచ్ ను చేజార్చుకున్నారు.
Pages: 1 -2- News Posted: 20 February, 2010
|