కొత్త బ్యాంకులకు పోటీ
దేశంలో ఆర్థిక సేవల రంగంలో ప్రస్తుత వ్యవస్థలో ఒక మాదిరి పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో రుణగ్రహీతలకు, ఎన్ బిఎఫ్ సిలకు నిధుల సమీకరణ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉంటున్నది. రుణగ్రహీతలు అధిక వడ్డీ రేటు చెల్లించవలసి వస్తున్నది. తక్కువ ఖర్చయ్యే 'కాసా' (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిధులు అందుబాటులో ఉండే బ్యాంకుల వలె కాకుండా ఎన్ బిఎఫ్ సిలు బ్యాంకుల కన్నా అధిక రేట్లకు మార్కెట్ నుంచి నేరుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల అవి అప్పు ఇచ్చే రేట్లు కూడా బ్యాంకుల కన్నా అధికంగానే ఉంటాయి. అధిక వడ్డీ రేట్ల వల్ల ఎన్ బిఎఫ్ సిల నుంచి రుణగ్రహీతలకు మార్జిన్లు కూడా పరిమితంగా ఉంటున్నాయి. దీనితో ఆ సంస్థల వృద్ధికి అంతరాయం కలుగుతున్నది. బ్యాంకులు కూడా తాము అప్పు ఇచ్చే వ్యాపారాల విషయంలో పరిమితులను ఎదుర్కొంటుంటాయి. ఉదాహరణకు, చాలా కొద్ది బ్యాంకులు మాత్రమే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సాధనాలు, వ్యవసాయ పరికరాలు, వాణిజ్య వాహనాలకు రుణాలుల ఇస్తుంటాయి.
తాము నిధులు సేకరించే విషయంలో ఎదురయ్యే అనిశ్చితి గురించి కూడా ఎన్ బిఎఫ్ సిలు తరచు ప్రస్తావిస్తుంటాయి. చివరిసారిగా రుణ సంక్షోభం పరాకాష్ఠలో ఉన్న 2008 ద్వితీయార్ధం, 2009 ప్రారంభ కాలంలో వలె ఎన్ బిఎఫ్ సిలకు నిధుల సమీకరణకు అవకాశాలు దాదాపుగా హరించుకుపోయాయి. ఎందుకంటే తమ వద్ద అప్పు తీసుకునే ఎన్ బిఎఫ్ సి దానిని తీరుస్తుందనే నమ్మకం రుణదాతకు ఉండడం లేదు.
Pages: -1- 2 News Posted: 1 March, 2010
|