'ఎయిర్ షో' టేకాఫ్
సర్వీస్ ప్రొవైడర్లు, విమానాశ్రయ మౌలిక వసతుల కల్పన సంస్థలు, విమానాల ఉత్పత్తి సంస్థలు వంటి 120 అంతర్జాతీయ, 75 భారతీయ సంస్థలు ఈ ద్వైవార్షిక కార్యక్రమంలో పాల్గొంటాయి. ఫిక్కీ ప్రాంతీయ డైరెక్టర్ వివేక్ కోడికల్ సమాచారం ప్రకారం, 40 పైచిలుకు విమానాలు స్టాటిక్, ఫ్లయింగ్ డిస్ ప్లే చేస్తాయి. ఆంటోనోవ్ యుఎసి రష్యా తన ఎఎన్-148 ప్రయాణికుల విమానాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ కార్యక్రమం ఇండియాలో భారీ స్థాయిలో వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని, 2016 - 17 నాటికి 580 మిలియన్ల మందికి పైగా విమాన ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి విమానాశ్రయాల నిర్మాణానికి, విస్తరణకు పెట్టుబడులు వస్తాయని నిర్వాహకులు తెలిపారు. 35 మెట్రోయేతర విమానాశ్రయాలను ప్రపంచ శ్రేణి విమానాశ్రయాలుగా తీర్చిదిద్దడానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) రూ. 4662 కోట్లు వెచ్చించాలని యోచిస్తున్నదని వారు తెలిపారు. 80 విమానాశ్రయాల స్థాయి పెంచుతారు. పది గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని సంకల్పించారు.
మహారాష్ట్రలోని గోండియాలో ప్రధాన పైలట్ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, సంయుక్త రంగంలో ఈ సంస్థ ఏర్పాటుకై భాగస్వాముల కోసం చూస్తున్నదని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిపాదిత మల్టీమోడల్ కార్గో హబ్, రూ. 24 కోట్లతో ఇందిరా గాంధి రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో శిక్షణ సౌకర్యాల మెరుగుదల, ఎంఆర్ఒ బిజినెస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే సంస్థలకు ఇతోధికంగా అవకాశాలు కల్పిస్తాయి. ఈ కార్యక్రమంలో మొదటి మూడు రోజులను బిజినెస్ సందర్శకులకు పరిమితం చేస్తారు. మార్చి 6, 7 తేదీలలో ప్రజలు అందరూ సందర్శించేందుకు వీలు కల్పిస్తారు.
Pages: -1- 2 News Posted: 2 March, 2010
|