'అవతార్'పై ఇ-మెయిల్ వార్!
అకాడమీ కన్ను తాను పంపిన 'ఇ-మెయిల్స్'పై పడనుందనే ప్రచారంతో చార్టియర్ వెంటనే క్షమాపణ దిగారు. ఇ-మెయిల్స్ పంపడం తప్పేననీ, స్టుపిడిటీ అనీ ఆయన ఒప్పుకున్నారు. 'నేను మీకు పంపిన ఇ-మెయిల్స్ సినిమా సెలబ్రేషన్స్ స్ఫూర్తికి విరుద్ధమేనని గ్రహించాను. ఫలానా సినిమాకి ఓటు వేయమని చెబుతూ మరో సినిమాపై వ్యాఖ్యానించడం వ్యక్తిగతంగానే కాకుండా, వృత్తిపరంగానూ పొరపాటే' అని చార్టియర్ స్పష్టం చేశారు. ఫస్ట్ టైమ్ నామినీగా తన ప్రవర్తనకు విచారిస్తున్నట్టు పేర్కొన్నారు.
చార్టియర్ చర్యను అకాడమీ సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి 'ఆంక్షలు' విధించే అవకాశం ఉందనే అంశంపై విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను ఆస్కార్ బరిలో నుంచి తప్పించడంలో భాగంగా ఆ సినిమాతో సంబంధం ఉన్న వారికి ఆస్కోర్ షో టిక్కెట్లు నిలిపివేసే అవకాశాలుంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. తుది బ్యాలెట్ కు ఇంకొద్ది రోజులు మాత్రమే ఉందనగా ఇలాంటి గందరగోళం వల్ల 'హర్ట్ లాకర్స్' విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వీరు అంటున్నారు. అయితే ఇలాంటి కథలు (ఇ-మెయిల్ వ్యవహారం) అకాడమీ ముందుకు వెళ్లడానికి సమయం పడుతుందనీ, దీని ప్రభావం ఎలా ఉంటుందనేది అనుమానమేననీ మాగ్జిమ్ మేగజైన్ సినీ విమర్శకులు పెటి హహ్మాండ్ పేర్కొన్నారు. ప్రచారం ఎలాంటిదైనా జనం తమకు నచ్చిన సినిమాకే ఓటు వేస్తారని ఆయన విశ్లేషించారు.
Pages: -1- 2 News Posted: 3 March, 2010
|