అమీర్ బిగ్ డీల్! ముంబాయి : ఇటీవలే విడుదలైన 'త్రీ ఇడియట్స్' సినిమా విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు మరో అదృష్టం కలిసి వచ్చింది. వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు గాను ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగనంత పెద్ద మొత్తంలో పారితోషికం అమీర్ కు లభించనున్నది. దుబాయ్ కి చెందిన ఒక టెలికమ్యూనికేషన్ సంస్థ 35 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అమీర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతవరకూ మరే ఇతర బాలీవుడ్ సెలబ్రిటీకీ ఇంత పెద్దమొత్తంలో పారితోషికం లభించలేదు. బాలీవుడ్ నటులకు దక్కిన అత్యదిక పారితోషికాలు కేవలం 12 కోట్లు, 15 కోట్ల రూపాయలు మాత్రమే. దుబాయ్ టెలికమ్యూనికేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండేళ్ళపాటు మీడియా షూట్స్ కు, మీడియా ప్రకటనల్లో అమీర్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంత పెద్ద ఒప్పందంపై అమీర్ ఒప్పందం చేసుకోవడంపై 'అడ్వర్టైజ్ మెంట్ గురు'గా ప్రసిద్ధుడైన ప్రహ్లాద్ కక్కర్ సానుకూలంగా స్పందించారు. అమీర్ తొలిసారిగా 1993లో కోలా సంస్థ కోసం నటించిన వాణిజ్య ప్రకటనకు ప్రహ్లాద్ కక్కరే దర్శకత్వం వహించారు. 'డబ్బు ఎంత ఇచ్చామన్నది పక్కన పెట్టండి. ఎంతో కష్టపడి అమీర్ ఖాన్ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇదేమంత ఆశ్చర్యకరం కాదు. ఒక వ్యక్తి తన తెలివితేటలతోను, కష్టపడి ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలడనే దానికి అమీర్ ఉదాహరణగా నిలిచాడు' అన్నారు. అమీర్ ఖాన్ తో కలవడం వల్ల ఆ సంస్థకు కూడా మంచి ప్రయోజనమే కలుగుతుంది. ఎందుకంటే ప్రచారం స్క్రిప్టు విషయంలో అమీర్ కచ్చితత్వం, అతని సొంత ఇమేజ్ కూడా సంస్థ ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించగలదన్నారు.
హొజయిరీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ 15 కోట్లు, అక్షయ్ కుమార్ 15 కోట్లు, హృతిక్ రోషన్ 15 కోట్లు, సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలు ఇంతవరకూ అత్యధిక పారితోషికం తీసుకున్నవారిగా నిలిచారు. తాజాగా అమీర్ కు దక్కిన 35 కోట్ల రూపాయల ఒప్పందం కారణంగా ఆ రికార్డులు వెనక్కిపోనున్నాయి. వాణిజ్య ప్రకటనల్లో నటనకు చెల్లించే పారితోషికం గత సంవత్సరం ఒక్కసారిగా పెరిగిపోయిందని ఒక లీడింగ్ అడ్వర్టయిజ్ మెంట్ నిర్మాత వ్యాఖ్యానించారు. కొత్తగా పరిశ్రమలో అడుగుపెట్టిన రణ్ బీర్ కపూర్ కు కూడా రెండేళ్ళ ఒప్పందం కోసం 7 కోట్ల రూపాయలను ఒక చెల్లించాల్సి వచ్చిందని మరో ప్రకటనకర్త తెలిపారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2010
|